దగ్గుబాటి ఫ్యామిలీకి తగిన కథ ఇంకా దొరకలేదా? ఆ కాంబినేషన్ ఎప్పుడు?

తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజాలతో మెగా, నందమూరి ఫ్యామిలీ తరువాత దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి అందరికీ తెలిసినదే. ఈయన వంశవృక్షం అయితే ఆయన నీడలో దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, ఇపుడు రానా ఇలా ఎంతోమంది నిర్మాతలుగా, హీరోలుగా మారి తమ సత్తా చాటుతున్నారు. మూడవ తరం హీరో అయిన రానా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ కుటుంబానికి కూడా ఒక తీరని కోరిక ఉందట. అదేమిటంటే…

‘బొబ్బిలి రాజా’ సినిమా గురించి వినే వుంటారు. D గోపాల్ దర్శకత్వంలో 1990లో దివ్యభారతి హీరోయిన్ గా, వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం బొబ్బిలి రాజా. ఈ సినిమా ఇప్పటికీ బుల్లితెరపై అలరిస్తుందంటే, ఆ సినిమా కథ, కధనం అటువంటిది మరి. ఇక ఈ సినిమాలోని దివ్యభారతి , వెంకటేష్ కూడా ప్రేక్షకులను తమ నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు. ముఖ్యంగా దివ్యభారతి అందానికి సినీ ప్రేక్షకులు అప్పట్లో నీరాజనాలు పలికేవారు. ఈ సినిమా అప్పట్లో విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను క్రియేట్ చేసింది. వెంకటేష్ కెరియర్ కు మొదటిసారి సిల్వర్ జూబ్లీ చిత్రంగా నిలిచింది ఈ సినిమా.

ఇకపోతే, బొబ్బిలి రాజా సినిమా అనేది దగ్గుబాటి ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఇది రిలీజై నేటికి 32 సంవత్సరాలు అవుతోంది. ఎప్పటినుండో ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని దగ్గుబాటి వారు అనుకున్నా, ఎందుకో కుదరడంలేదు. తాజాగా మళ్ళీ ఈ చిత్రం గురించి దగ్గుబాటి కుటుంబీకులు సీక్వెల్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అయితే బొబ్బిలి రాజా సీక్వెల్లో తనకు బదులు తన అన్న కుమారుడు రానా చేత చేయించాలని ఆలోచనలో వెంకటేష్ ఉన్నారట. మరి బొబ్బిలి రాజా సీక్వెల్ రానున్న రోజుల్లో వస్తుందో లేదో తెలియాలి అంటే దగ్గుబాటి ఫ్యామిలీ నే ఈ విషయంపై నోరు విప్పక తప్పదు.

Share post:

Latest