రకుల్ ప్రీతిసింగ్ కు దురదృష్టం అంటే ఇలానే ఉంటుందా..?

మహేష్ బాబు డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్పైడర్.. ఈ సినిమాని మహేష్ బాబు ఒప్పుకోవడంతో అందరూ తెలివైన నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత సీన్ రివర్స్ అయిందని చెప్పవచ్చు.. స్పైడర్ సినిమా కూడా భారీ డిజాస్టర్ కావడం జరిగింది. ఈ చిత్రానికి ఏకంగా రూ.125 కొట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడం జరిగిందట ఈ చిత్రం తమిళ్ ,తెలుగు భాషలలో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా నటించారు. సూర్య నటనకు మాత్రం అందరి ప్రశంసలు అందుకున్నాడు SJ. సూర్య.

Spyder Box Office Collection in USA: Mahesh Babu, Rakul Preet and SJ Suryah  starrer becomes the seventh highest Telugu grosser of 2017 | Telugu Movie  News - Times of India
వాస్తవానికి ఈ పాత్ర కాస్త గడ్డం పెంచేలా చేసి మహేష్ తోనే చేయించాలని మురగదాస్ ముందుగా అనుకున్నారట.అయితే ఈ రకంగా మహేష్ గడ్డం పెంచమనడం అది కుదరదని.. ఆల ఎక్కడ కూడ ఆ ఫోటోలు లీక్ అవ్వకుండా ఆ టైంలో మహేష్ పలు జాగ్రత్తలు కూడా తీసుకున్నారట కానీ లుక్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం మహేష్ బాబుకి ఆ పాత్ర సూట్ అవ్వదని భావించిన మురగదాస్ దాన్ని లైట్ గా తీసుకున్నాడు. దీంతో ఆ పాత్రకు ఎస్ జె సూర్య ని తీసుకున్నాడు సమాచారం.

Parineeti Chopra believes Bollywood superstars 'will never change':  'They've given 25-30 years of hard work' | Entertainment News,The Indian  Express
ఇక హీరోయిన్గా రకుల్ ప్రీతిసింగ్ ఫైనల్ చేశారు కానీ అంతకుముందు ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాని అనుకున్నారు. అందుకోసం ఒక తెలుగు ట్రైనర్ని పెట్టి ఆమెకు తెలుగు కూడా చాలా రోజులు నేర్పించారు.కానీ చివరికి ఈ సినిమా లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆమె మాటలు మ్యాచ్ కాకపోవడంతో రకుల్ ప్రీతిసింగ్ ఫైనల్ చేశారు దర్శకనిర్మాతలు. అయితే స్పైడర్ వంటి డిజాస్టర్ నుంచి తప్పుకున్న పరిణితి చోప్రా రకుల్ మాత్రం బుక్ అయిపోయిందని చెప్పవచ్చు. ఈమె ఈ సినిమా కోసం కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంది. ఇక అప్పటినుంచి రకుల్ ప్రీతిసింగ్ కెరియర్ లో సక్సెస్ కాలేదని చెప్పవచ్చు.

Share post:

Latest