“ఇదంతా నా కర్మ..నా దురదృష్టం..” లారెన్స్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!

పాపం రాఘవ లారెన్స్ ని ఇంత ఎమోషనల్ గా ఎప్పుడు చూసి ఉండరు . చాలా ఎమోషనల్ అవుతున్నారు . ఆయన ఎమోషనల్ మాటలు విన్న రెబెల్ ఫ్యాన్స్ అలాగే లారెన్స్ ఫ్యాన్స్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇంతకీ లారెన్స్ ఎందుకు అంతలా బాధపడుతున్నారో తెలుసా? ..దానికి కారణం కృష్ణం రాజు . ఆదివారం తెల్లవారుజామున మరణించిన కృష్ణంరాజును కడసారి చూపులు చూసుకోలేని రాఘవ లారెన్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు.

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున 3:15 నిమిషాలకు ఏఐజి హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా పోస్ట్ కరోనా సింప్ టమ్‌స్ ఉన్న కారణంగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని రెబెల్ ఫ్యామిలీ ఎవరికి చెప్పకుండా దాచింది. కాగా చికిత్స తీసుకుంటున్న కానీ కృష్ణంరాజు స్పందించకపోవడం.. ఆయన బాడీ ఆ ట్రీట్మెంట్ కి రియాక్ట్ కాకపోవడంతో డాక్టర్స్ పరిస్థితి చేయి జారిపోయినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన డాక్టర్స్ చెప్పిన కొన్ని గంటలకే తుది శ్వాస విడిచారు. అంతేకాదు కృష్ణం రాజు అంత్యక్రియలలో ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ గా మారింది.

ఆ వీడియోని చూసిన రెబల్ అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలామంది సినీ ప్రముఖులు ఆయనను ఈ సందర్భంగా స్మరించుకున్నారు . అంతేకాదు ఆయనతో ఉన్న స్నేహం గురించి బయటపెట్టారు ..కొందరు ఆయనను కడసారి చూసుకునేందుకు రాలేకపోయారు ..వాళ్లలో ఒకరు రాఘవ లారెన్స్. రాఘవ లారెన్స్ డైరెక్షన్లో కృష్ణం రాజు రెబల్ అనే సినిమా చేశాడు.ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటించాడు . కానీ ఈ సినిమా ఊహించనంత హిట్ కాలేకపోయింది. ఆ టైంలో వీళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం బాగా కనెక్ట్ అయింది. కాగా ఈ క్రమంలోనే కృష్ణంరాజు కడసారి చూపులకు రాలేకపోయానని బాధపడ్డారు. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండడం వల్ల ఆయనను కడసారి చూసుకునేందుకు నోచుకోలేకపోయానని.. నా అంత దురదృష్టవంతుడు ఎవరు ఉండరని ..ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆయన లెగిసి ప్రభాస్ గారి ద్వారా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు ఆకాంక్షించారు. దీంతో రాఘవ లారెన్స్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

 

 

Share post:

Latest