ఇళయదళపతి విజయ్ తో రష్మిక సెల్ఫీ తీసుకుంది, చూసారో లేదో?

ఇళయదళపతి అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు విజయ్‌. అవును, ప్రముఖ తమిళ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాట అతని క్రేజ్ చూస్తే మతి పోతుంది. ఇక మన క్యూట్ రష్మిక మందన్నా గురించి కూడా తెలిసినదే. ఇకపోతే వీరు వారసుడు చిత్ర షూటింగ్‌ సందర్భంగా కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో రష్మిక, విజయ్‌ ఎంతో క్యూట్‌గా, యంగ్‌గా కనిపిస్తుండటం విశేషం. ముఖ్యంగా విజయ్‌ కుర్రాడిలా మారిపోవడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో విజయ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. దాంతో క్షణాల్లో ఈ ఫోటో వైరల్ గా మారింది. వారసుడు అనే పేరుతో తెలుగులో మొదలైన చిత్రం తమిళంలో వరిసు పేరుతో రూపొందుతుంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్కేల్‌లో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ హౌదరాబాద్‌లో జరుగుతుంది. హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ క్రమంలో రష్మిక, విజయ్‌ ఇలా సరదాగా సెల్ఫీకి పోజులిచ్చారు. ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ పిక్‌ అభిమానుల మనసుల్ని దోచేస్తోంది. ఇదిలా ఉంటే విజయ్‌ హెయిర్‌పై మీమ్స్ పేలుతున్నాయి. విజయ్‌ తలపై చిన్న హెయిర్‌ లేకుండా చిన్న గ్యాప్‌ కనిపిస్తుంది. దీంతో ఆ సొట్టేంటంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా విజయ్‌, రష్మికల లేటెస్ట్ సెల్ఫీ సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. విజయ్‌ దీంతోపాటు లోకేష్‌ కనగరాజ్‌తో తన 67వ చిత్రంలో నటిస్తున్నారు.

Share post:

Latest