లైగర్‌ సినిమా దెబ్బతో… పూరి జగన్నాథ్ డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఆగిపోయిందట..!?

తెలుగులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీజగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. పూరీ ఎందరో హీరోలకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు. స్టార్ హీరోల కొడుకులను టాలీవుడ్‌కు పరిచయం చేసి వాళ్లకి మొదటి సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన ఘనత కూడా పూరీకే దక్కుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పూరి తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు.

Puri Jagannadh To Make An International Project, After Jana Gana Mana

అయితే టెంపర్- ఈ స్మార్ట్ శంకర్ సినిమాలు తప్ప. ఆయన చేసిన సినిమాలు అన్ని బాక్స్ఆఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టాయి. ఇదే క్రమంలో పాన్ ఇండియా లెవెల్ లో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా విడుదలైన మొదటి ఆట నుంచి భారీ నెగటివ్ టాక్‌ తో పూరీ సినిమాల లోనే అతి చెత్త సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయింది.

Vijay Deverakonda, Puri's JGM Title Poster: Glorious

ఇదే క్రమంలో పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జన గణ మన సినిమా షూటింగును ముంబైలో ఆట్ట హాసంగా ప్రారంభించారు. ఇందులో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. తాజాగా లైగర్‌ ఇచ్చిన ప్లాప్ తో పూరీ తన డ్రీమ్‌ ప్రాజెక్టును వదులుకున్నట్టు విజయ్‌తో కాకుండా ఎవరితో తోను చేయను అన్నట్టు సమాచారం బయటకు వస్తుంది.

Share post:

Latest