ఆత్మహత్య చేసుకున్న పూరీ అసిస్టెంట్.. అసలు కారణం..?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఎంతో మంది స్టార్ హీరోలకు మంచి లైఫ్ ని అందించారని చెప్పవచ్చు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి తో మొదలైన పూరీ జగన్నాథ్ కెరియర్ ఆ తర్వాత మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి ఎంతో మంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి వారి ఖాతాలో మంచి విజయాలను చేర్చాడు. ఇక పూరీ జగన్నాథ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. నిజానికి ఈ హీరోలు వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో పూరీ జగన్నాథ్ వారికి అండగా నిలిచి మంచి విజయాలను అందించాడు.

Puri Jagannadh targets Bandla Ganesh after over-the-top speech - Telugu  News - IndiaGlitz.com

ఇకపోతే తన కొడుకు ఆకాష్ పూరీ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా తీసి పూర్తిస్థాయిలో డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు పూరీ జగన్నాథ్. ఇప్పుడు పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో జనగణమన అనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కించాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టి తన కొడుకును స్టార్ హీరో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే కనీసం తండ్రి డైరెక్షన్లోనైనా ఆకాశ్ పూరీ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటాడేమో తెలియాల్సి ఉంది.puri jagannadh assistant director, puri jagannadh assistant director  suicide – puri jagannadh assistant director sai kumar ends to his life due  to financial problems in hyderabad

ఇదంతా ఇలా ఉండగా పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ తాజాగా ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పూరీ జగన్నాథ్ టీం తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయింది.. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సాయికుమార్, హైదరాబాదులోని దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న తర్వాత పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసిస్టెంట్ డైరెక్టర్ సాయికుమార్ గతంలో పూరీ జగన్నాథ్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినట్టు సమాచారం. అయితే ఇప్పుడు అప్పుల బాధలు ఎక్కువ అవ్వడంతో తట్టుకోలేక సాయికుమార్ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Share post:

Latest