పెదనాన్న మరణంతో పెద్దదిక్కుగా మారనున్న ప్రభాస్.. ఆ బాధ్యతలు నెరవేర్చేనా..?

ప్రముఖ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య కారణంగా ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 83 సంవత్సరాలు వయసులో ఈరోజు తెల్లవారుజామున 3:25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎప్పటిలాగే అనారోగ్య బారినపడిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఆరోగ్యంగానే తిరిగి వస్తారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఆయన మరణం ఒక్కసారిగా అందర్నీ భయభ్రాంతులకు గురిచేసింది. ఇక ఒక్కసారిగా ప్రభాస్ తో పాటు కుటుంబీకులు, సినీ ప్రపంచమే కన్నీటి పర్యంతమవుతోందని చెప్పవచ్చు. ఇక కృష్ణంరాజు మరణించడంతో ప్రభాస్ కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోయిందని చెప్పవచ్చు.

Prabhas with his sisters and Krishnam raju family best moments | Filmi  Frame - YouTube

నిజానికి కృష్ణంరాజు తన తమ్ముడు సూర్య నారాయణరాజు మరణించడంతో కుటుంబ బాధ్యతలను కృష్ణంరాజు చేపట్టారు. ఇక కృష్ణంరాజుకు కొడుకు లేకపోవడం ముగ్గురు కుమార్తెలే కావడం గమనార్హం. దీంతో ప్రభాస్ ని తన పెద్ద కొడుకుగా భావిస్తూ ఉంటారు కృష్ణంరాజు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కు సంబంధించిన అన్ని విషయాలను దగ్గరుండి చూసుకునే కృష్ణంరాజు ప్రభాస్ కు పెళ్లి చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే అయితే ఆయన కోరిక తీరకుండానే మరణించడం చాలా బాధాకరమని చెప్పాలి. ఇక పెదనాన్న మరణంతో పూర్తిస్థాయిలో శోకసంద్రంలో మునిగిపోయారు ప్రభాస్.

ఇక పెదనాన్న కృష్ణంరాజు అంత్యక్రియల తర్వాత ప్రభాస్ ఆ ఇంటికి పెద్దగా మారి ఆ ఇంటికి తీర్చాల్సిన ఎన్నో బాధ్యతలను తాను చేపట్టాల్సి ఉంటుంది. కృష్ణంరాజు కూతుర్లు ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి.. ఇక వీరు క్షత్రియ రాజుల వంశస్థులైన విజయనగర సామ్రాజ్యం వారసులు కాబట్టి ఇక రాజకుటుంబీకులకే ఇచ్చి వివాహం చేయాలి అని అప్పట్లో కృష్ణంరాజు ఆలోచించారు. ఇక మరి ఆ బాధ్యతను ప్రభాస్ తప్పకుండా నెరవేర్చాల్సి ఉంటుంది. ఇక అంతే కాదు తాను కూడా వివాహం చేసుకొని ఆ ఇంటికి మరొక వ్యక్తిని తీసుకురావాలి. ప్రభాస్ ఒకవైపు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఇక కనీసం ఇప్పటికైనా ఒకవైపు సినిమాలను మరొకవైపు కుటుంబ బాధ్యతలను చేపట్టి తన కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిందిగా అభిమానుల సైతం కోరుకుంటున్నారు.

Share post:

Latest