12 ఏళ్లలో తొలిసారి ఇలా ..కృష్ణం రాజు కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం..!!

మనకు తెలిసిందే టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణం రాజు ఈనెల 11న అనారోగ్యంతో మృతి చెందారు, పోస్ట్ కోవిడ్ సింటమ్స్ తో బాధపడుతున్న కృష్ణంరాజు గత నెల రోజులుగా హాస్పిటల్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి, అంతేకాదు ఈ విషయాన్ని రెబెల్ ఫ్యామిలీ బయటకు రాకుండా దాచేసింది, అభిమానులు కంగారు పడతారని కావచ్చు లేదా సెక్యూరిటీ దృష్ట్యా కావచ్చు కారణాలు ఏదైనా రెబెల్ ఫ్యామిలీ కృష్ణంరాజు ఆరోగ్య సమస్యలు దాచి తప్పు చేసింది అంటున్నారు సినీ విశ్లేషకులు.


కాగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న కృష్ణంరాజు ఈనెల 11న తెల్లవారుజామున మూడు గంటల 15 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు అధికారికంగా ధ్రువీకరించారు . గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం బాగో లేనప్పటికీ ట్రీట్మెంట్ తో బ్రతుకుతూ వచ్చారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆయన హాస్పటల్లోనే తన తుది శ్వాసను విడిచారు. దీంతో సినీ పెద్దలు, ప్రముఖులు, విశ్లేషకులు అందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇండస్ట్రీ పెద్దదిక్కుని కోల్పోయింది అంటూ బాధపడ్డారు. రాజకీయ నాయకులు సైతం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు . రెబల్ స్టార్ ప్రభాస్ అయితే కృష్ణం రాజు మరణాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు.

మిగతా వాళ్ళందరూ ఆ విషయం నుంచి బయటపడుతున్నా ..కానీ ప్రభాస్ ఇంకా పెదనాన్ననే గుర్తు చేసుకుంటూ ఆయన రూమ్ లోనే కూర్చొని ఏడుస్తున్నారు ..బాధపడుతున్నారు. కృష్ణంరాజు మృతితో ప్రభాస్ పద్ధతికి కోల్పోయినట్లు అయ్యింది. దీంతో కృష్ణం రాజు మరణంతో ప్రభాస్ నే రెబల్ ఫ్యామిలీకి పెద్దదిక్కుగా మారారు. ఈ క్రమంలోనే ఆయన తదుపరి కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ప్రభాస్ ఈనెల 28న మొగల్తూరు రానున్నట్లు సమాచారం. అంతేకాదు అక్కడే మూడు రోజులపాటు ఉంటారట. కృష్ణంరాజు సంస్కరణ సభ ,సమారాధన జరిపించినట్లు తెలుస్తుంది .

అయితే ప్రభాస్ మొగల్తూరులో అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లు కావస్తుంది . 2010లో ప్రభాస్ తండ్రి మరణించినప్పుడు దిన కార్యక్రమాల కోసం ప్రభాస్ మొగల్తూరు వచ్చాడు. ఆ తర్వాతే ఇప్పటివరకు ఆయన మొగల్తూరు రానే రాలేదు . మళ్లీ పెదనాన్న మరణంతో ఆయన మొగల్తూరు రాబోతున్నాడు . కాగా 12 ఏళ్ల తర్వాత కృష్ణంరాజు మరణం తర్వాత మళ్లీ మొగల్తూరుకి ప్రభాస్ వస్తుండడం ఒక సంతోషకరమైన వార్తే అయినా కానీ ఆయన్ని అలా దిగులుగా చూడడం అభిమానులకు కొంచెం బాధపడే విషయమే. అంతేకాదు ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు ఫ్యామిలీ మొత్తం మొగల్తూరు వెళ్లనుంది .