టాలీవుడ్ పై దండయాత్ర ప్రకటించిన హరిహర వీరమల్లు.సినిమా రీ రిలీజ్ అయినా కూడా తగ్గని క్రేజ్.

టాలీవుడ్ పవర్ స్టార్,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ పేరొక ప్రభంజనం. పవన్ సినిమాలు అన్ని సెన్సేషన్ సృష్టించాయి.ఆయనకు వున్నా క్రేజ్ టాలీవుడ్ లో మరే హీరో కి కూడా లేదు. పవన్ సినిమాలు తెలియని వారెవరు వుండరు అంటే అది అతిశయోక్తి కాదేమో. పవన్ సినిమాలు గోకులంలో సీత,సుస్వాగతం,తమ్ముడు,తొలిప్రేమ,బద్రి,ఖుషి,గబ్బర్ సింగ్,జల్సా,అత్తారింటికి దారేది అన్నీ కూడా బ్లాక్బస్టర్ సినిమాలే.ఈ సినిమాలు రిలీజ్ అయినపుడు ఎంతో సెన్సేషన్ సృష్టించాయి.

అయితే పవన్ 2014 లో జనసేన పార్టీ స్థాపించారు,సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా,నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.సెప్టెంబర్ 2 వ తేదీ పవన్ పుట్టిన రోజు ఈ సందర్బంగా ఆయన అభిమానులకు బంపర్ ఆఫర్స్ లభించాయి. అవేంటంటే పవన్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఒక నిమిషం నిడివి వుండే టీజర్ ని “పవర్ గ్లాన్స్ “ పేరిట విడుదల చేసారు.ఈ టీజర్ విడుదలయిన కాసేపటికే అంచనాలకు అందని వ్యూస్ తో రికార్డ్స్ బ్రేక్ చేసింది.ఈ టీజర్ చూస్తున్నంతసేపు పవన్ యాక్టింగ్ కి ఫిదా అవని వారు వుండరు.ఈ టీజర్ విడుదలయిన కాసేపటికే రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా ఈ మధ్య హీరో ల పుట్టిన రోజు కు ఆ హీరో లు నటించిన పాత సినిమాలు రీ రీలీజ్ చేస్తున్నారు.పవన్ బర్త్ డే సందర్బంగా ఆయన నటించిన జల్సా,తమ్ముడు సినిమా లని రీ రిలీజ్ చేసారు.అయితే జల్సా సినిమా వరల్డ్ వైడ్ ఆల్ టైం రికార్డ్స్ సృష్టించి,మహేష్ పోకిరి రికార్డ్స్ బ్రేక్ చేసింది.జల్సా సినిమా రీ రీలీజ్ అయినప్పటికీ కలెక్షన్స్,ఫాన్స్ క్రేజ్ మాత్రం ఇపుడే రిలీజ్ అయినా కొత్త సినిమా ల వుంది.ఇది పవన్ కు వున్న క్రేజ్.ఇది పవనిజం అంటే..

Share post:

Latest