పవన్ కళ్యాణ్ కి 3వ భార్య కూడా విడాకులు ఇవ్వనుందా.. ట్వీట్ వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ గురించి ఆయన వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తెరచిన ఒక పుస్తకం లాంటిది ఆయన జీవితం అని చెప్పడంలో సందేహం లేదు. సినిమాలలో సక్సెస్ అయినట్టుగా అటు వైవాహిక జీవితంలో ఇటు రాజకీయాలలో సక్సెస్ కాలేకపోతున్నారు పవన్ కళ్యాణ్.. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆయన మూడవ భార్య అన్నా లేజినోవా ఈయనకు లీగల్ నోటీసులు పంపించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన ఒక ట్విట్టర్ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉండటం గమనార్హం.Who is Anna Lezhneva?అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కుటుంబ పెద్దల ప్రోత్సాహంతో నందిని రెడ్డిని వివాహం చేసుకున్నాడు. అయితే ఈమెతో జీవితాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదని చెప్పవచ్చు. బద్రి సినిమాతో రేణు దేశాయ్ తో ప్రేమలో పడిన పవన్ కళ్యాణ్ సహజీవనం చేసి అకిరా నందన్ కు జన్మనిచ్చాడు. ఇక రేణు దేశాయ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడని తెలుసుకున్న నందిని రెడ్డి పవన్ కళ్యాణ్ తో జీవితం కొనసాగించలేకపోయేది . దీంతో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొడుకు సమక్షంలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ను వివాహం చేసుకోవడం జరిగింది. ఇక తర్వాత వీరికి ఆధ్యా అనే పాప జన్మించింది.. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతున్న నేపథ్యంలో రేణు దేశాయ్ సహించక ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చింది.

ఇక తన అభిరుచులకు తగ్గట్టుగా ఉండే రష్యా కు చెందిన అన్నా లేజినోవా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే వీరికి కూడా ఇద్దరు పిల్లలు పుట్టి సంతోషంగా ఉన్నారు అనుకునే సమయంలోనే ఇప్పుడు మళ్లీ అన్నా లేజినోవా కూడా పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చింది. ఆమె కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ కు విడాకుల కు సంబంధించి లీగల్ నోటీసులను పంపించిందట. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ట్విట్టర్ లో మాత్రం ఈ వార్త చాలా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

Share post:

Latest