పోసానికి ఆ విధంగా సహాయం చేసిన పరుచూరి బ్రదర్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడుగా, కమెడియన్ గా పేరు పొందాడు పోసాని కృష్ణ మురళి.. ఈ మధ్యకాలంలో సినిమా ఆఫర్లు కాస్త తగ్గినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా పోసాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. పోసాని ఎవరైనా ఇండస్ట్రీలో నమస్కారం పెడితే అవతలి వ్యక్తి యుగో సాటిస్ఫాక్షన్ అవుతుందని తెలిపారు.

When Sr Actor Planned A Murder
అయితే ఒకసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక డైరెక్టర్ తనని ప్యాడ్, కొన్ని పేపర్స్ తీసుకురమ్మని చెప్పారట.. అయితే అవి దొరకపోవడంతో పేరు పెట్టి ఆ డైరెక్టర్ పిలిచానని ఆయన తెలిపారు.. అయితే అతను మాత్రం తనని సార్ అనలేవా అని నోటికి వచ్చినట్లు తిట్టాడని పోసాని తెలియజేశారు.ఆ తర్వాత తనని క్షమించమని కోరినట్లుగా తెలియజేశారు. అప్పుడే తనని మురళి అని పిలిచారట.. ఆ వెంటనే పోసాని మురళి అని ఎందుకు పిలిచావని మురళి గారు అని ఎందుకు పిలవలేదని కాలితో తన్నానని చెప్పుకొచ్చారు పోసాని. తన మేనరిజం కేవలం తన పడిన ఇబ్బందుల వల్లే వచ్చాయని తెలిపారు. పరుచూరి బ్రదర్స్ దగ్గర 5 సంవత్సరాలు పనిచేశానని తెలియజేశారు.

Paruchuri Brothers on board for VV Vinayak
నేను మెంటలోడినని తనని జైలుకు వెళ్లాలని అసిస్టెంట్ డైరెక్టర్లు కొంతమంది తన పైన తప్పుడు ప్రచారం చేశారని అయితే ఆ సమయంలో పరుచూరి బ్రదర్స్ తమకి అండగా నిలబడ్డారని తెలియజేశారు. తనకు పరుచూరి బ్రదర్స్ మధ్య మంచి బంధం ఉండడం వల్లే ఇలాంటి ప్రాధాన్యత ఇచ్చారని ఆయన తెలియజేశారు. తన గురించి జరిగిన నెగటివ్ ప్రచారాన్ని నేను ఎప్పుడూ చెప్పుకుంటానని కూడా తెలియజేశారు. ఇక తన తండ్రి గురించి చెబుతూ తన తండ్రి చాలా మంచివారు అని కానీ మద్యం, పేకాట కు బానిస అవ్వడం వల్లే తన తండ్రి చనిపోయారని తెలియజేశారు. సినీ ఇండస్ట్రీలో తనతో ఫ్రెండ్షిప్ చేసే అంత ఫ్రెండ్స్ ఎవరు లేరని కూడా తెలియజేశారు పోసాని. అయితే ప్రస్తుతం ఎక్కువగా రాజకీయాల వైపే తన దృష్టి పెట్టి సినిమాలు తగ్గిస్తున్నారు పోసాని.

Share post:

Latest