ఒకే ఒక జీవితం ప్రీమియర్ షో షార్ట్ రివ్యూ..!!

హీరో శర్వానంద్, అమల తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రం ఈ రోజున విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలకమైన పాత్రలో నటించారు . ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. వరుస మూవీ ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ కు ఈ చిత్రం ఊరట ఇచ్చిందా లేదా అనే విషయంపై ఇప్పుడు మనం తెలుసుకుందాం.Suriya Releases Teaser Of 'Oke Oka Jeevitham', Fans Approve The First Lookఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మ్యూజిక్ లో టాప్ పొజిషన్ కి రావాలని కష్టపడుతున్న శర్వానంద్ (ఆది)తనతో పాటు తన స్నేహితులు ప్రియదర్శన్(చైతూ), వెన్నెల కిషోర్(శ్రీను) కలిసి ఉంటారు. ఇక ఈ ముగ్గురు జీవితాల్లో ఎవరి సమస్యతో వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తమ ప్రస్తుత పరిస్థితిపై అసంతృప్తిగా కూడా కలిగి ఉంటారు. ఇలాంటి సమయంలోనే వీరి జీవితంలోకి నాజర్ (సైంటిస్టుగా) రావడం జరుగుతుంది . అతను కనిపెట్టిన టైం మిషన్ తో ఈ ముగ్గురు తమ గతంలోకి వెళ్లి తమ ప్రస్తుత సమస్యలను అలాగే భవిష్యత్తును చాలా గొప్పగా మార్చుకోవాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆది తమ తల్లి ప్రాణాలు కాపాడాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోని కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వీరు గతంలోకి ఎలా వెళ్తారు? ఆ తర్వాత కథ ఏం జరుగుతుంది? అనే విషయంపై ఈ చిత్రం కథ తెరకెక్కించడం జరిగింది.

ఇక టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు ఈ మధ్య వరుసగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో చాలా వరకు ప్రేమకు సంబంధించి సన్నివేశాలు, హృదయం బరువు ఎక్కే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సెంటిమెంట్, ఎమోషనల్ మాత్రమే కాకుండా అన్నిటిపరంగా బాగుందని టాక్ బాగా వినిపిస్తోంది. శర్వానంద్ ఈ సినిమాలో తన పాత్రకు తగ్గట్టుగా ఎంతో చక్కగా నటించి మెప్పించారు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ లో పలుమార్పులను తీసుకువచ్చి ఎమోషనల్ ఫీలింగ్స్ లో బాగా నటించాడు శర్వానంద్.Oke Oka Jeevitham Trailer: Sharwanand and Ritu Varma's Film Promises a  Sentimental Time Travel Story (Watch Video) | 🎥 LatestLY

అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం లాజిక్ కరెక్ట్ గా అనిపించకపోయినా సినిమా పరంగా ఎమోషనల్ గా చూపించడంతో ఈ సినిమా స్లోగా సాగినా బాగానే ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ పరంగా కూడా సినిమా సాంకేతిక విభాగంలో కూడా చాలా వర్క్ అవుట్ అయిందని చెప్పవచ్చు. ఎట్టకేలకు ఈ సినిమాతో శర్వానంద్ మంచి విజయాన్ని అందుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అమలా నటన, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాలో హైలెట్గా నిలిచాయి. అలాగే కంటెంట్ పరంగా ఈ సినిమా అద్భుతంగా ఉందని సినీ ప్రేక్షకుల నుంచి టాక్ వినిపిస్తోంది. మొత్తానికైతే వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న శర్వానంద్ కు మంచి హిట్ పడిందని చెప్పవచ్చు.