శృతి మించితే వారిపై కేసు పెడతా అంటున్న ఎన్టీఆర్ భార్య..!!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలోకి రాకముందే ఆయన తన మేనకోడలు బసవతారకంను వివాహం చేసుకున్నారు. ఇక వీరి బంధానికి గుర్తుగా ఏకంగా 12 మంది పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే.. ఇకపోతే అందులో కొంతమంది మాత్రమే సినీ ఇండస్ట్రీ వైపు రాగా మిగతా వారందరూ కూడా వ్యాపారాలలో సెటిల్ అయ్యారు. ఇకపోతే నందమూరి తారక రామారావు జానపద , సాంఘిక, పౌరాణిక, చారిత్రక వంటి ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఎన్టీఆర్ రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.

రాజకీయపరంగా కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక రాజకీయంలో కూడా తెలుగుదేశం పార్టీని స్థాపించి.. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగేలా చాలా గొప్పగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. ఇక ఎన్నో పథకాలతో మరెన్నో పనులతో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు ఎన్టీఆర్. ఇకపోతే ఈయన ఆరోగ్యం క్షీణించినప్పుడు బసవతారకం అప్పటికే క్యాన్సర్ వ్యాధితో మరణించడంతో తోడు కోసం ఆయన దగ్గరకు ఇంటర్వ్యూకి వచ్చిన లక్ష్మీపార్వతినే వివాహం చేసుకున్నారు . ఇక ఆ రోజు నుంచి లక్ష్మీపార్వతి దగ్గరుండి ఆయనను చూసుకునేది. ఇక ఆయన చివరి క్షణం వరకు లక్ష్మీపార్వతి దగ్గరుండి మరీ చూసుకుంది అని చెప్పవచ్చు.

అయితే ఇటీవల తాజాగా వైఎస్ఆర్సిపీ పార్టీ వారు ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ ఆఫ్ సైన్సెస్ పేరును మార్చి వైయస్సార్ పేరు పెట్టడం జరిగింది. ఇంకా దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది. ఎన్టీఆర్ మాత్రం ఈ విషయం పై సానుకూలంగా ప్రవర్తించడంతో బాలకృష్ణ, చంద్రబాబు ఇద్దరు కూడా ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ విపరీతంగా మాటలు మాట్లాడుతున్నారు . అంతేకాదు ఇదే సమయంలోనే లక్ష్మీపార్వతిని కూడా టార్గెట్ చేయడంతో ఆమె మాట్లాడుతూ.. నా పెళ్లి గురించి , నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా కామెంట్లు చేస్తూ శృతి మించితే కచ్చితంగా కేసు పెడతాను అంటూ వార్నింగ్ కూడా ఇస్తోంది.

Share post:

Latest