ఆ ఫేమస్ స్టార్ హీరోయిన్ ని NTR తన సినిమాకి వద్దని చెప్పాడట.. ఎందుకబ్బా?

స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి పరిశ్రమ మన్నగలుగుతుందంటే అంతా ఆయని చలవే. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న NTR ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేశారు. దాదాపు 7 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈయన ఉన్నట్టుండి పదవి నుంచి తప్పుకోవడం అందరికీ తెలిసినదే. ఇక సినిమాలలోని జానపద, సాంఘిక, పౌరాణిక నేపథ్య చిత్రాలలో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు NTR.

సినిమాలే ఊపిరిగా బతికిన NTR తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించారు. NTR తన సినిమాల్లో నటించే హీరోయిన్స్ ని అన్నగారే స్వయంగా శ్రద్ధ తీసుకొని మరి నిర్ణయించేవారట. ఈ క్రమంలోనే ఎంతో పాపులారిటీ ఉన్న హీరోయిన్లను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఈ క్రమంలోని సినీ లోకం మెచ్చి దేశవ్యాప్తంగా ఎంతో మంచి పాపులారిటీని సంపాదించుకొని కోట్ల మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న “వహీదా రెహ్మాన్” ఒకరు. ఇక ఈమెను NTR కూడా ఆయన తన సినిమాలో రిజెక్ట్ చేయడం జరిగింది.

తెలుగులో “ఏరువాక సాగారో” అనే పాటలో నటించిన వహీదా రెహమాన్ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ఈ హీరోయిన్ ను అందరూ తమ సినిమాల్లో పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు. కానీ NTR మాత్రం వహీదా రెహమాన్ ను తన సినిమాలో వద్దు అని చెప్పారు. ఇక అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీ ని కుదిపేసింది. లవకుశ సినిమాలో ఎన్టీఆర్ రాముడిగా.. సీత కోసం ఎవరైతే బాగుంటుందని ఆలోచనలు దర్శక నిర్మాతలు ఉన్నప్పుడు అంజలి దేవి, సావిత్రి లాంటివారు బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేము అని చెప్పారు . అప్పుడు సీత పాత్ర కోసం వహిదా రెహమాన్ ను పెట్టుకోవాలి అంటే ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. దాంతో ఒకానొక దశలో ‘కులం’ కారణంగానే ఆమెకి అన్నగారు అవకాశం ఇవ్వలేదనే అపవాదులు మోశారు.

Share post:

Latest