అల్లుఅర్జున్ పై విమర్శలు వర్షం కురిపిస్తున్న నెటిజెన్స్.. కారణం..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన తన నటనతో ప్రతిభతో మంచి గుర్తింపు సొంతం చేసుకోవడమే కాకుండా మెగా నీడ నుండి బయటకు వచ్చి సొంత కాళ్లపై నిలబడి.. తమ అల్లు ఫ్యామిలీ గుర్తింపును మరింతగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇకపోతే పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ పై నెటిజన్ లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

Allu Arjun on Working in Bollywood: 'Hindi Is Out of My Comfort Zone But...'

రెబల్ స్టార్ కృష్ణంరాజు నిన్న ఉదయం 3:25 గంటల సమయంలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఏఐజి హాస్పిటల్ లో మరణించడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అంతేకాదు ఆయన మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న ఆసుపత్రి నుంచి కృష్ణంరాజు పార్తివదేహాన్ని ఆయన ఇంటికి తరలించగా సినీ తారలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్కరిగా వచ్చి ఆయన పార్థ దేహాన్ని సందర్శించి.. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ జాడ కనిపించలేదు. కానీ ఈరోజు ప్రేక్షకుల సందర్శనార్థం కోసం మహాప్రస్థానానికి ఆయన పార్థివదేహాన్ని వుంచబోతున్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ చేసిన పనికి నెటిజన్స్ ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం.

అసలు విషయం ఏమిటంటే పుష్ప సినిమాకు సైమా అవార్డు లభించడమే ఒక కల అనుకుంటే .. మరొకసారి సైమా అవార్డు లభించడంతో అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని తగ్గేదేలే అని సిగ్నేచర్ మూమెంట్ ను చేసి మరీ ట్వీట్ చేశాడు.. ఇక కృష్ణంరాజు పార్థివ దేహానికి సంతాపం తెలపకుండా ఇలా తగ్గేదేలే అంటూ ట్వీట్ చేయడంతో నేటిజెన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ,గోపీచంద్, మహేష్ బాబు ఇలా తదితరులు వచ్చి కృష్ణంరాజు మృతికి సంతాపం తెలుపుతుంటే అల్లు అర్జున్ మాత్రం తనకు ఏమాత్రం పట్టనట్టు తాను ఇండస్ట్రీ కానన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అంటూ అందరికీ ఆగ్రహం వ్యక్తం చేశారు.. కానీ సైమా అవార్డు ఫంక్షన్ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి తీవ్ర ప్రగాఢ సానుభూతిని కుటుంబానికి తెలియజేశారు. అంతేకాదు ప్రభాస్ ను ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు. ఇక అప్పటివరకు అల్లు అర్జున్ నిందించిన నెటిజెన్స్ సైతం ఒక్కసారిగా నోళ్లు మూసినట్టు అయింది.

Share post:

Latest