వావ్: బాలయ్య అభిమానులకు ఊపు తెప్పించే వార్త..ఇక దబిడిదిబిడే..!!

సీనియర్ హీరోలలో బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నారు. గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత‌ కుర్ర దర్శకులతో వరుస‌ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కుర్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తో NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా బాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేస్తారని తెలుస్తుంది.

ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీనియర్ హీరోల అందరికంటే బాలకృష్ణ సినిమాలు కు డిస్ట్రిబ్యూటర్‌లు ఎక్కువ‌ ఆసక్తి చుపుతున్నారు అని తెలుస్తుంది.ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న బాలకృష్ణ 107వ‌ సినిమాకు టైటిల్ పెట్టకపోయినా. ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్‌లు ఏకంగా 100 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో బాలకృష్ణ అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

Share post:

Latest