ఆ వైసీపీ డాక్టర్ ఎమ్మెల్యే మూటాముల్లె సర్దుకోవాల్సిందే…!

ఆయన వ్రుత్తి రీత్యా డాక్టర్. అయితే.. వైసీపీ అధినేత జగన్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నుంచి వరుస విజయాలు అందుకుంటున్నారు. అయితే.. ఆదిలో మంచి డాక్టర్ ఎమ్మెల్యే అని అనిపించుకున్నా.. తర్వాత తర్వాత.. మాత్రం ఆయన వ్యవహారం.. వివాదంగా మారిపోయింది. దీంతో ఆయన టికెట్ పై అనేక అనుమానాలు కమ్ముకున్నాయి. ఆయనే గుంటూరు జిల్లాలోని నరసరావుపేట.. అసెంబ్లీ నియోజకవర్గం సారథి.. వరుస విజయాల డాక్టర్ ఎమ్మెల్యే.. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈయన జగన్ కు అత్యంత విధేయులనే పేరు తెచ్చుకున్నారు.

పార్టీలోనూ.. బయట కూడా.. జగన్ అంటే అత్యంత విలువ ఇస్తారు. జగన్ పాదయాత్ర చేసినప్పడుు.. స్వయంగాఈయన కూడా.. నరసారావుపేట నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసి.. జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే 2019లోనూ టికెట్ దక్కించుకుని గెలుపుగుర్రం ఎక్కారు. ఇక.. మంత్రివర్గంపైనా.. ఆయన కన్నేశారు. అయితే.. గోపిరెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. ఈ అసంత్రుప్తి ఆయనను వెంటాడుతోంది. ఇదిలావుంటే.. ప్రజల్లో మంచి నాయకుడనే పేరున్నా.. రాజకీయంగా మాత్రం ఆయన స్థానిక నేతలపై మాత్రం పట్టు సాధించలేక పోయారు.

దీంతో ఈ టికెట్ను దక్కించుకునేందుకు ఆయన సామాజిక వర్గానికే చెందిన.. ఇద్దరి నుంచి ముగ్గురు వరకు.. కూడా.. ప్రయత్నిస్తున్నారని .. సమాచారం. ముఖ్యంగా.. గురజాల యువ ఎమ్మెల్యే.. కాసు మహేష్ రెడ్డి.. నరసరావుపేట టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. అంటున్నారు. ఇప్పటికే.. ఆయన దీనిపై కన్నేశారని.. చర్చలు కూడా జరుపుతున్నారని అంటున్నారు. అంతేకాదు.. స్థానికంగా తనకు ఉన్న బలాబలాలను కూడా.. ఆయన అంచనా వేసుకుంటున్నట్టుతెలుస్తోంది. అంటే.. దాదాపు గోపిరెడ్డి.. టికెట్ కు.. సొంత పార్టీ నాయకులు.. సొంత సామాజిక వర్గం నాయకులే ఎసరు పెడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి.. 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న గోపిరెడ్డి.. సునాయాసంగా రెండోసారి కూడా విజయం సాధించారు. అయితే.. వచ్చే ఎన్నికలకు సంబందించి మాత్రం.. ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుందని.. అంటున్నారు.. రాజధాని ప్రాంతంలోని నియోజకవర్గం కావడం.. ప్రజలు.. వైసీపీపై గుర్రుగా ఉండడం.. అమరావతినే రాజధానిగా కోరుకోవడం.. వంటివి గోపిరెడ్డికి ప్రధానంగా సెగపెడు తున్నాయి. ఇక, టీడీపీ కూడా బలమైన నాయకుడిని ఇక్కడ నిలబెట్టడం ద్వారా.. ఖచ్చితంగా తన ఖాతాలో వేసుకుని తీరాలని.. తన సీటును తిరిగి తను దక్కించుకోవాలని.. భావిస్తోంది.

ఇన్ని పరిణామాల నేపథ్యంలో గోపిరెడ్డి గెలుపు అంత కాదని.. సొంత పార్టీలోనేనేతలు గుసగుసలాడుతున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి.. డాక్టర్ గోపిరెడ్డి మూటాముల్లెసర్దుకుంటారా? లేక.. అధిష్టానాన్ని ఒప్పించి.. టికెట్ సాధిస్తారా? అనేది ఆస్తకిగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.