ఇద్దరు ఫ్లాప్ హీరోలతో భారీ మల్టీ స్టారర్..తప్పు చేస్తున్న సీతారామం డైరెక్టర్..?

తాజాగా వచ్చిన సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ హ‌ను రాఘవపూడి. ఆయన తన తర్వాతి సినిమా ఎవరితో చేస్తారన్ని అందరూ ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఇదే క్రమంలో హ‌నురాఘ‌వ‌పూడి తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అందరూ ఆసక్తి చెబుతున్నారట. సీతారామం హిట్ అవటంతో స్టార్ హీరోల దగ్గర నుంచి వరుస‌ ఆఫర్లు వస్తున్నాయట. ఇదే క్రమంలో ఆయన ఎవరితో సినిమా చేస్తారన్న దాని గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Interview- Hanu Raghavapudi- I wrote this script keeping Sharwa's image in  mind | 123telugu.com

హను రాఘవపూడి ఓ క్రేజీ సబ్జెక్టును పట్టుకున్నాడట.. ఆ కథ‌తో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని చూస్తున్నారట. ఇక అందులో ఇద్దరు యంగ్ హీరోలు నటిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం హ‌ను రాఘవపూడి అహీరోలా ఇద్ద‌రికి కథ చెప్పాడట. వాళ్లు చేస్తున సినిమాలు అయిన వెంట‌నే హ‌నురాఘ‌వ‌పూడి సినిమాలో బిజీ అవుతారని తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరోలు ఎవరంటే టాలీవుడ్ క్రేజీ హీరోలైన నాని- శర్వానంద్ లు హను రాఘవపూడి సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించబోతున్నారట.

That is not Sharwanand's film says Nani

ఈ వార్త బయటకు రావటంతో ఇద్దరి ప్లాప్ హీరోలతో కలిసి సినిమా తీసి హిట్టు కొట్టే సాహ‌సం చేస్తున్నావా హను రాఘవపూడి అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా వచ్చిన ఒకే ఒక జీవితంతో శర్వానంద్ హిట్‌ కొట్టాడు కానీ ఆయన గత సినిమాల పరిస్థితి ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఇక నాని సంగతి అంటారా చెప్పనే అవసరం లేదు ఆయన హిట్ కొట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. మరి చూడాలి హను రాఘవపూడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు.

Share post:

Latest