నందమూరి హీరో పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన కండక్టర్ ఝాన్సీ.. వీడియో వైరల్..!

గత కొద్దిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు గాజువాక కండక్టర్ ఝాన్సీ. ఈమె పేరు ప్రస్తుతం తెలియని వారంటూ ఎవరు ఉండరు.. టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఈటీవీలో ప్రసారమవుతున్న ఏదో ఒక షోలలో ఇలాంటి టాలెంట్ ఉండే వాళ్ళని ప్రోత్సహిస్తూ తీసుకొస్తుంటారు. అలా గాజువాక బస్ కండక్టర్ అయిన ఝాన్సీ ని శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి తీసుకురావడం జరిగింది మల్లెమాల సంస్థ. ఇక ఝాన్సీ 11 సంవత్సరాల నుంచి తను డాన్స్ ఎంత కష్టపడి నేర్చుకుందో అయితే ఆ కష్టానికి ఇప్పుడు తగ్గ ఫలితం దక్కిందని ఆమె ఆనంద పడుతోంది.

sridevi drama company dancer gajuwaka conductor jhansi real life struggle  details, sri devi drama company, gajuwaka, conductor jhansi, life story,  gajuwaka conductor jhansi, lady conductor jhansi, conductor jhansi  struggles - Telugu Jhansi,

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత తనలో ఉండే టాలెంట్ ని బయటపెడుతూ పలు డాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉన్నది. ఇలా ఝాన్సీ చేసిన వీడియోలను చూసినటువంటి మల్లెమాలవారు ఏకంగా ఆమెను శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలోని పల్సర్ బండి అనే పాటకు కూడా డాన్స్ చేస్తూ అందరిని తన వైపుకు తిప్పుకుంది ఝాన్సీ. ఈ షో తర్వాత ఈమె ఒక సాధారణ బస్సు కండక్టర్ అయ్యిండి కూడా డాన్స్ పై ఎక్కువ ఇష్టం ఉండడంతో ఇలా సెలబ్రిటీగా మారడంతో చాలామంది ఈమె వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఇక ఝాన్సీ ఒకవైపు బస్సు కండక్టర్గా బాధ్యతలు వ్యవహరిస్తూనే.. మరోవైపు పలు కార్యక్రమాలలో డాన్స్ చేస్తూ ఉన్నది. ఇలా ఝాన్సీ ఒక కార్యక్రమంలో భాగంగా నందమూరి హీరో హరికృష్ణ నటించిన సీతయ్య సినిమాలోని ఒక్క మగాడు అనే పాటకు ఈమె డాన్స్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది . ఇది ఈమె ఓల్డ్ వీడియో అన్నట్లుగా తెలుస్తోంది. ఈమె డాన్స్ కి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు . పలువురు నెటిజన్ లు కూడా ప్రశంసిస్తున్నారు.

Share post:

Latest