‘ ది ఘోస్ట్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క‌లు ఇవే… నాగార్జున టార్గెట్ ఎన్ని కోట్లంటే…!

అక్కినేని మన్మధుడు కింగ్ నాగార్జున సోలో హీరోగా సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. అయితే లేటెస్ట్ సినిమా ”ది ఘోస్ట్” తో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొడతానని నాగార్జున ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు మొదలుపెట్టారు.

ఇకపోతే క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నాగార్జున నటించిన హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ `ది ఘోస్ట్`. ఇప్పటికే టీజర్ విడుదలై ట్రైలర్ మరియు `వేగం` సాంగ్ తో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమా మేకర్స్ భారీగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అయితే హీరో నాగార్జున రెమ్యునేషన్ మినహాయించి ఈ సినిమాని రూ. 20 -22 కోట్ల రూపాయలు బడ్జెట్ తో నిర్మించారని ట్రేడ్ వర్గాల నుండి సమాచారం.

అయితే ఇక ప్రమోషనల్ కంటెంట్ క్రియేట్ చేసిన బజ్ తో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా మూవీ మేకర్స్ కు 20 -25 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇకపోతే `ది ఘోస్ట్` సినిమా కోసం నాగార్జున తన రెమ్యూనేషన్ తో పాటుగా ఆంధ్ర ప్రాంతంలోని కొన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తీసుకున్నారని టాక్ అయితే నడుస్తుంది. ఇక నిర్మాతలు అయితే ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నారు. `ది ఘోస్ట్` సినిమా పవర్ఫుల్ యాక్షన్, అండ్ ఫ్యామిలీ ఎమోషన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కించార‌ని తెలుస్తుంది. కింగ్ నాగార్జున ఇందులో ఇంటర్పోల్ ఆఫీసర్ విక్రమ్ గా కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్ గా సోనాల్ చౌహన్ నటించింది. ఇకపోతే `ది ఘోస్ట్` సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నార‌ని స‌మాచారం

Share post:

Latest