మరణించిన తర్వాత విడుదలైన స్టార్ హీరో, హీరోయిన్ ల సినిమాలివే..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ పొజిషన్ కి చేరుకున్న తర్వాత అర్ధాంతరంగా మరణిస్తే.. మరి కొంత మంది ఒకటి రెండు సినిమాలలో నటించి బాగా పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత స్వర్గస్తులవడం గమనార్హం. ఇకపోతే మరికొంతమంది తమ సినిమాలు ఇంకా షూటింగ్లో ఉండగానే మరణించిన సెలబ్రిటీలు కూడా ఎంతోమంది ఉన్నారు. అలా వారు నటించిన సినిమాలు విడుదల కాకుండానే మరణించారు. ఇక వారు మరణించిన తర్వాత ఆ సినిమాలు విడుదలయ్యాయి. ఇకపోతే స్టార్ హీరో, హీరోయిన్ లు మరణించిన తర్వాత విడుదలైన సినిమాల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

సౌందర్య:Actress Soundarya: పండ్లు పట్టుకున్న సౌందర్య పెయింటింగ్.. నిజంగా అలా  ఉన్నట్టు..?– News18 Teluguతెలుగు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సౌందర్య ఎవరు ఊహించని విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి.. సినీ ఇండస్ట్రీకి తీరనిలోటు మిగిల్చింది.. ఇకపోతే ఈమె అప్పటికే ఆప్తమిత్రుడు, శివశంకర్ వంటి సినిమా షూటింగ్లను పూర్తి చేసుకుంది. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఆమె చనిపోయిన తర్వాత విడుదలయ్యాయి.

పునీత్ రాజ్ కుమార్:Puneeth Rajkumar Death: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స  పొందుతూ మృతి.. షాక్‏లో సినీ పరిశ్రమ.. | Sandalwood Power star Puneeth  Rajkumar Passes Away At 46 Due To Heart attack ...కన్నడ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ అర్ధాంతరంగా గుండెపోటుతో మరణించారు. ఇకపోతే అప్పటికే ఆయన నటించిన జీన్స్ సినిమా షూటింగ్ 90% పూర్తి చేసుకుంది. ఇక ఆయన మరణించడంతో ఆ సినిమాను డబ్బింగ్ లేకుండానే విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత విడుదలైన ఆయన సినిమా జీన్స్.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్:సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పోస్ట్‌మార్టమ్ పూర్తి.. అంత్యక్రియలకు సిద్దమైన  బంధువులు! | bollywood actor sushant singh rajput postmortem report - Telugu  Filmibeatబాలీవుడ్ యంగ్ హీరోగా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న ఈయన ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఈయన చనిపోయేనాటికి దిల్ బేచారా చిత్రం పూర్తయింది.. కానీ విడుదలకు నోచుకోలేదు. ఇక సుశాంత్ చనిపోయిన 40 రోజులకే ఈ సినిమాను విడుదల చేయగా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అక్కినేని నాగేశ్వరరావు:Akkineni Nageswara Rao's 96th birth anniversary: Check out the actor's  family tree | Regional Indian Cinemaఇక అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే చివరిగా తన కుటుంబ సభ్యులతో కలిసి నటించిన చిత్రం మనం . ఈ సినిమా విడుదల అవ్వకముందే ఆయన మరణించారు. ఇక ఆయన మరణించిన తర్వాత ఈ సినిమాని విడుదల చేయగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. అంతే కాదు అక్కినేని ఫ్యామిలీకి ఇది ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.

వీరే కాకుండా దివ్యభారతి కూడా అర్ధాంతరంగా
చనిపోయింది. ఇక ఆమె చనిపోయే నాటికి ఆమె నటించిన తొలిముద్దు సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది . ఇక ఈ సినిమా ఆమె మరణించిన తర్వాత విడుదల చేశారు.. హీరోయిన్ ప్రత్యూష కూడా చనిపోయే నాటికి సౌండ్ పార్టీ సినిమాను పూర్తి చేసింది. ఆత్మహత్య చేసుకున్న తర్వాత సినిమాను విడుదల చేయగా మంచి విజయం సొంతం చేసుకుంది ఈ సినిమా.

Share post:

Latest