అందరు మంచిది అనుకున్న ఉపాసన ఆ విషయంలో మాత్రం మహా చెడ్డది..ఎందుకంటే..!?

అవునండి ఇప్పుడు అందరు ఇదే అంటున్నారు. మెగా కోడలు ఉపాసన ఆ విషయంలో మహా చెడ్డది. అభిమానుల కోరిక తీర్చట్లేదు అంటూ మండిపడుతున్నారు. దీంతో ఉపాసన పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలే ఉపాసన అంటే కొందరు స్టార్ హీరోల్ భార్యలకు కూడా పడదు . అంత పాపులారిటీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎంత ఆస్తులు ఉన్న ..ఆమె ఉండే సింప్లిసిటీకి బోలెడు మంది ఫిదా అయిపోతారు. పైగా ఇలాంటి మూమెంట్లో ఉపాసన గురించి వైరల్ అవుతున్న న్యూస్ చూసి ..కొందరు మెగా హైటెర్స్ భళే సంతోషపడుతున్నారు. అసలు మేటర్ ఏంటంటే…

మనకు తెలిసిందే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆమె చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఆ తర్వాత ఇంట్లో పెద్దలకు ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళ పెళ్లి అయ్యి. దాదాపు పదేళ్లు గడుస్తుంది. జనరల్ గా ఎవరైనా సరే పెళ్లైన రెండేళ్లకి గుడ్ న్యూస్ చెప్తే వినాలని ఆశపడతారు. కానీ ఉపాసన పదేళ్లయిన ఇంతవరకు అలాంటి న్యూస్ చెప్పలేదు . అంతేకాదు మెగా వారసుడు ఎప్పుడు వస్తాడు అంటూ కోట్లాదిమంది అభిమానులు ఆమె గుడ్ న్యూస్ చెప్తే వినాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు.

కాగా ఈ విషయం గురించి ఉపాసన ఎప్పటికప్పుడు తన పాయింట్ ని క్లియర్ గా చెప్తుంది. కానీ మెగా అభిమానులకు ఆ ఆన్సర్ సరిపోవట్లేదు. కచ్చితంగా ఉపాసన ఏదో దాచుతుందని.. ఆ విషయంలో రామ్ చరణ్ ని ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం ఓ ఈవెంట్లో ఓపెన్ గానే చెప్పేసాడు.. నాకు మనవడితో మనవరాలు ఆడుకోవాలని ఉందని కానీ అదంతా వాళ్ళ ఇష్టం పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. దీంతో ఉపాసన అటు మెగాస్టార్ ని ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇద్దరిని బాధపడుతుందని మెగా అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. దీంతో కొందరు మెగా కోడలు ని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Latest