రజినీ కాంత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శక రత్నం… ఆ పాత్రకి రజని సరిపోడా?

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తలైవా పేరు చెబితే తమిళనాట బాక్షాఫీసులు బద్దలవుతాయి. వయస్సు 70 దాటుతున్నా అతని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజంటే పాన్ ఇండియా సినిమాలు వచ్చి ఇండియా మొత్తం కొందరు హీరోలు పేర్లు సంపాదిస్తున్నారు గాని, ఆరోజుల్లేనే అంటే పాన్ ఇండియాలు లేని రోజుల్లోనే రజనీ పాన్ ఇండియా స్థాయిలో తన హవాని కొనసాగించాడు. అందుకే రజనీ పేరు తెలియని భారతీయులు ఉండరనే చెప్పుకోవాలి.

ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మరో మోస్ట్ అవైటెడ్ తమిళ సినిమా “పొన్నియిన్ సెల్వన్.” ఇండియన్ దర్శకరత్న దర్శకుడు మణిరత్నం తీసిన మొట్టమొదటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దీనిమీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి ఎందరో బిగ్ స్టార్స్ కనిపిస్తున్నారు. మరి ఈ భారీ సినిమా ఇప్పుడు ప్రమోషన్స్ జరుపుకుంటుండగా దర్శకుడు మణిరత్నం కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో చెయ్యడం ఆసక్తిగా మారింది.

ఈ బిగ్ ప్రాజెక్ట్ లో రజినీకాంత్ చిన్న సపోర్టింగ్ రోల్ కిఅవకాశం ఇవ్వమని మన మణిగారిని అడిగారట. దానికి మణి గారు నేను ఇవ్వలేనని చెప్పారట. అయితే దీనికి సరైన కారణం కూడా లేకపోలేదు. చిన్న సపోర్టింగ్ రోల్ లో చూపించి రజిని గారి అభిమానుల హృదయాలను గాయపరచలేనని, వారి అంచనాలు తప్పకుండా అందుకోలేనని అందుకే రజిని గారు అడిగినా కూడా చెయ్యనని చెప్పేసానని మణిరత్నం అసలు విషయం బయట పెట్టారు. ఈ విషయం తెలిసిన రజనీ అభిమానులు మణి గారిని తెగ పొగిడేస్తున్నారు.

Share post:

Latest