ఆయన వల్లే మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేశారా..?

ఎన్నడూ లేనివిధంగా ఈసారి టాలీవుడ్ లో మా ఎన్నికలు రాజకీయాలను తలపించే విధంగా కొనసాగిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు ఒకరికొకరు దూషించుకుంటూ మరింత దారుణంగా బూతులు కూడా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు అలాగే ప్రకాష్ రాజ్ ఇద్దరూ కూడా పోటీ చేయగా ప్రకాష్ రాజ్ లోకల్ కాదు అని మంచు విష్ణు ను గెలిపించడం జరిగింది. ఇకపోతే మంచు విష్ణు మా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మా భవనం నిర్మిస్తానని చెప్పి ఇప్పటివరకు దాని ఊసే ఎత్తకపోవడంతో సర్వత్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కానీ సీనియర్ నటీనటులకు పెన్షన్ వచ్చే పథకాన్ని ఆయన నెరవేర్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు త్వరలోనే సినీ కార్మికుల కోసం ఉచితంగా వైద్యశాలతో పాటు వారికి ఇల్లు కూడా కట్టించబోతున్నట్లు సమాచారం.

Vishnu Manchu, Krishnam Raju: Krishnam Raju told me to contest our  elections: Manchu Vishnu – maa association president vishnu manchu speech  at rebel star krishnam raju santhapa sabha

ఇదిలా ఉండగా మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేయడానికి రెబల్ స్టార్ కృష్ణంరాజు కారణమట. అసలు విషయంలోకి వెళ్తే.. కృష్ణంరాజు మరణించిన తర్వాత సెలబ్రిటీలందరూ సంతాప సభ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి మంచు విష్ణు కూడా హాజరయ్యి కృష్ణంరాజుకు నివాళులు అర్పించారు. ఇక తర్వాత మంచు విష్ణు కృష్ణంరాజుతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కృష్ణంరాజు అంకుల్ మా ఇంటికి రావడం .. మేము వాళ్ళ ఇంటికి వెళ్లడం జరుగుతూ ఉండేది. ఏ ఫంక్షన్ లో కలిసినా.. ఎక్కడికి వెళ్ళినా ఆయన వచ్చేటప్పుడు మాత్రం ఎంట్రీ వేరేగా ఉండేది. ఎప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టి నిలబడేవారు.. ఇక అది చూపించి నాన్నగారు అలా ఉండాలని చెప్పేవారు.

Prabhas With Manchu Vishnu and His Wife Veronica

ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీకి నా పేరు చెప్పక ముందు నేను నిలబడాలి అని ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది కృష్ణంరాజు అంకులే .. నువ్వు నిలబడాలి అని అంకుల్ చెప్పగా నాన్నగారు అంకుల్ కి ఫోన్ చేసి వద్దు వాడు సినిమాలు చేసుకుంటాడు అంటే నాన్నగారిని దబాయించారు అంటూ కృష్ణంరాజుతో తనకున్న అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Share post:

Latest