పెళ్ళి పీటలు ఎక్కనున్న మంచు మనోజ్..ఈ సారి అలా..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు మనోజ్ మొదట్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈయన నటించినా అన్ని సినిమాలు కూడా ఒక రకంగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ ఇటీవల ఎక్కువగా విజయాలను సొంతం చేసుకోకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక తన తండ్రి ఏర్పాటు చేసిన విద్యానికేతన్ సంస్థలను చూసుకుంటూ మరొకవైపు బిజినెస్ లో దూసుకుపోతున్నాడు మంచు మనోజ్. ఇక త్వరలోనే మంచి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తానని కూడా అభిమానులకు హామీ ఇచ్చాడు. కెరియర్ లో సక్సెస్ పొందే ప్రయత్నం చేస్తున్న మంచి మనోజ్ వైవాహిక జీవితంలో మాత్రం ఇందుకు దూరమయ్యాడని చెప్పవచ్చు.Spotted: Manchu Manoj with Bhuma Mounika Reddyకానీ ఎట్టకేలకు వైవాహిక జీవితంలో కూడా సంతోషాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు మంచు మనోజ్ . ఈ క్రమంలోనే ఆయన మరొకసారి పెళ్లికి సిద్ధమయ్యాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే మొదటి వివాహం లాగా కాకుండా ఈసారి ఆచితూచి అడుగు వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఏకంగా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మంచు మనోజ్. మంచు మనోజ్ ప్రణతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ 2019లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక ఈ క్రమంలోని ఆంధ్రప్రదేశ్లోని ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన యువతని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం తెర మీదకు వచ్చింది.Manchu Manoj Responds On Marriage With Bhuma Mounika Reddy - Movie News

ఆమె ఎవరో కాదు భూమా నాగిరెడ్డి భూమా శోభ దంపతుల రెండవ కుమార్తె భూమా మౌనిక రెడ్డి. ఇక తాజాగా మౌనిక రెడ్డితో కలిసి మంచు మనోజ్ హైదరాబాద్ లో విగ్నేశ్వరుని దర్శనం చేసుకోవడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే మంచు మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక పోతే భూమా మౌనిక కూడా గతంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకొని తర్వాత విడాకులు తీసుకుంది. ఇక వీరిద్దరి ఇప్పుడు వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest