మహేష్- త్రివిక్రమ్ సినిమా నుండి… లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలో మహేష్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో ఇది మూడో సినిమాగా తెరకెక్కుతుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖ‌లేజా చిత్రాలు మంచి క్లాసికల్ సినిమాలగా మిగిలిపోయాయి. ఈ సినిమాలో థియేటర్‌లో అంత ఆడకపోయినా… టీవీలో ఈ సినిమాలు మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాయి.. ఈ రెండు సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చిన టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగిపోతున్నాయి. ఇదే క్రమంలో మహేష్- త్రివిక్రమ్ కాంబోలో 3 సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు.

Mahesh Babu : Mahesh Babu.. shirtless for the first time.. in swimming fool..

ఈ సంవత్సరం మొదటిలోనే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చింది. మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. సినిమా కోసం ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్‌ను టోటల్‌గా మార్చేశాడు. ఇటీవల నమ్రత శిరోద్కర్ షేర్ చేసిన పోస్ట్ లో కూడా మహేష్ బాబు లుక్‌ కూడా చాల కొత్త‌గా ఉంది. అ పోస్ట్ చూసిన అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఈ నెలో మొద‌లు పెడత‌రు అనే వార్త‌లు వ‌చ్చాయి. కాని ఈ సినిమా షూటింగ్ మ‌రింత అల‌స‌యం అయే అవ‌కాశాలు క‌నిపిస్తున్న‌యి. ముందుగా అనుకున్న రోజున‌ షూటింగ్‌ను ప్రారంభించలేకపోతునమ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

SSMB28: Makers Of Mahesh Babu's Next Are Gearing Up To Give Fans A Big Update Soon

దాంతో ఈసినిమా షూటింగ్ ఇంకో వారం రోజుల పాటు వాయిదా వేసిన‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎస్‌.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ఇదివరకే తెలిపింది. ఈ సినిమాను పాన్ ఇండియ లేవ‌ల్‌లో విడుద‌ల చేయ‌డ‌నికి చిత్ర‌ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Share post:

Latest