సితార అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపోయిన మహేష్ బాబు.. ఇంతకీ ఏం అడిగిందంటే?

ప్రిన్స్ మహేష్ బాబు తన గారాలపట్టి సితారతో కలిసి నిన్న ఆదివారం జీ తెలుగులో ఒక డ్యాన్స్ షోలో పాల్గొన్నాడు. ఈ షోకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు తన కుమార్తెను తీసుకొని ఇంతవరకు ఏ టీవీ ప్రోగ్రామ్‌కి హాజరు కాలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా మొదటిసారి సితారతో కలిసి జీ తెలుగు టీవీ ప్రోగ్రామ్‌లో సందడి చేసి ఆశ్చర్యపరిచాడు.

మహేష్ బాబు, సితార సరదాగా మాట్లాడిన దృశ్యాలను ఇప్పుడు అభిమానులు చూసి బాగా ఖుషి అయ్యారు. అంతేకాకుండా ఆ డ్యాన్స్ షోలో సితార అడిగిన ఓ చిలిపి ప్రశ్న అడిగి అందరినీ ఆలోచింపజేసేలా చేస్తోంది. ఆ చిన్నారి వేసిన ప్రశ్నకు షోలో ఉన్న వారెవరూ కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇంతకీ సితార ఏం అడిగిందని ఆలోచిస్తున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.

“క్యాట్ డ్రింక్స్ హాట్ మిల్క్ ఫ్రమ్‌ ఏ బౌల్… వాట్ హ్యాపేన్?” అంటే ‘పిల్లి ఒక గిన్నెలో ఉన్న వేడి పాలు తాగితే ఏమవుతుంది?’ అనేది సితార వేసిన ప్రశ్న. దాంతో అందరూ ఆ ప్రశ్నకు సమాధానం ఆలోచించడం మొదలుపెట్టారు. వెంటనే మహేష్ బాబు ‘పిల్లి మూతి కాలిపోతుంది’ అని సమాధానం చెప్పాడు. దానికి సితార ‘కాదు’ అని చెప్తుంది. ‘మూతి కాలిపోతుంది, అమ్మా’ అని అదే ఆన్సర్ ఇచ్చాడు మహేష్. రెండోసారి కూడా సితార కాదు అని చెప్తుంది.

ఆ తరువాత ఆడియన్స్‌లో ఒకరు ‘కడుపు కాలిపోతుందనే’ సమాధానం చెప్పారు. ఈ సమాధానం కూడా తప్పే అనే సితార చెప్పడంతో మహేష్ బాబు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో నువ్వే చెప్పు అని అడుగుతాడు. దాంతో సితార ‘బౌల్ ఖాళీ అవుతుంది’ అని చెప్పగానే మహేష్ తల పట్టుకుంటాడు. అక్కడ ఉన్న వారంతా పగలబడి నవ్వుతారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Share post:

Latest