మహేష్ బాబు డబ్బుకోసం ఏదన్నా చేస్తాడా? నిరాశానిస్పృహలతో అభిమానులు!

మహేష్ బాబు అంటేనే అందానికి బ్రాండ్ అంబాసిడర్. ఈ సూపర్ స్టార్ సినిమాల సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఏదన్న బిజినెస్ కి బ్రాండ్ అంబాసిడర్ కావాలంటే అందరూ ముందుగా ఎంచుకొనేది మహేష్ బాబునే. కటౌట్ అలా ఉంటుంది మరి. ఈ క్రమంలోనే మహేష్ అనేక వ్యాపార బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తారు. డబ్బులు కూడా దండిగా ఇవ్వడంతో మన సూపర్ హీరో వెనకాడకుండా ప్రమోట్ చేస్తుంటాడు. అదంతా పక్కన బెడితే, ఈ మధ్య కాలంలో హీరోలు బుల్లి తెరపై కనిపించడం చాలా కామన్ విషయంగానే మారింది. వెండి తెరపై కంటే కూడా బుల్లి తెరపై ఎక్కువ పారితోషికం ఇవ్వడం ఎక్కువ మందికి చేరువడం జరుగుతుంది.

అందుకే ఈ మధ్య మహేష్ బుల్లి తెరపై కనువిందు చేస్తున్నాడు. తన కూతురు సీతారాతో కలిసి ఓ షోలో పలకరించిన సంగతి తెలిసినదే. కానీ అందుకు ఒక పరిమితి ఉంటుంది. స్టార్ హీరోల విషయంలో ఇది కొంచం భిన్నంగా ఉండాలి అని ఫాన్స్ భావిస్తుంటారు. ఇష్టానుసారంగా చిన్నపాటి కార్యక్రమాల్లో స్టార్ హీరోలు కనిపిస్తే అభిమానులు మానసికంగా హర్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే తాజాగా మహేష్ బాబు విషయంలో అదే జరిగింది. తాజాగా మహేష్ బాబు జీ తెలుగు కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఓకే చెప్పాడు. దాదాపుగా రూ.10 కోట్ల పారితోషికానికి ఆయన జీ తెలుగుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇటీవలే డాన్స్ కార్యక్రమంలో సందడి చేశాడు.

అది ఓకే కానీ మహేష్ బాబు ఏకంగా “పడమటి సంధ్యారాగం” అనే ఒక సీరియల్ ని కూడా ప్రమోట్ చేస్తూ అభిమానులని అసహనానికి గురయ్యేలా చేసాడు. అవును, మరీ ఇంత దారుణంగా దిగజారి పోయావేంటి బాస్ అంటూ కొందరు సోషల్ మీడియాలో నేరుగానే మహేష్ బాబుని ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో స్టార్ హీరోల్లో ఎవరు కూడా ఇలాంటి పనులు చేయలేదని, మహేష్ బాబు కేవలం డబ్బు కోసం స్థాయి తగ్గించుకుని సీరియల్ ప్రమోషన్ లో కూడా కనిపించేందుకు ఓకే చెప్పాల్సిన అవసరం లేదని, అంతే కాకుండా.. దీనిలో క్యూట్ బేబీ సితారను కూడా తీసుకురావడం ఎందుకని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Share post:

Latest