మహేష్ బాబు 28వ సినిమాకి సర్వం సిద్ధం.. ఇక ఫ్యాన్స్‌కి పూనకాలే..!!

మహేష్ బాబు అప్‌కమింగ్ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న కొద్దీ అది మొన్నటిదాకా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12న అనపూర్ణ స్టూడియోలో స్టార్ట్ కాబోతోంది. ఈ స్టూడియోలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక సెట్ నిర్మించారు. ఇక్కడే మూవీ మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. త్రివిక్రమ్ మొట్టమొదటిగా ఫైట్ సీన్‌తో కెమెరాకు పని చెప్పబోతున్నారు. అల వైకుంఠపురములో సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాని ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో మాస్ యాక్షన్‌ మూవీగా త్రివిక్రమ్ తీసుకురానున్నాడని టాక్.

ఈ సినిమాలో మహేష్ ప్రత్యేకమైన హెయిర్ స్టైల్, మీసంతో సరికొత్తగా కనిపించనున్నాడు. మహేష్ రీసెంట్ యాడ్స్‌లో కూడా మీసంతో భలే స్టైల్‌గా కనిపించాడు. గెస్ట్‌గా వెళ్లిన ఓ టీవీ ప్రోగ్రామ్‌లో కూడా అదే లుక్‌లో దర్శనమిచ్చాడు. దాంతో మహేష్ లుక్ గురించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ కూల్ అండ్ యూత్‌ఫుల్ లుక్‌ అభిమానులకు బాగా నచ్చేసింది. సినిమాలో ఈ లుక్‌లో మహేష్ అదరగొట్టనున్నాడని ఇప్పటికే ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఆమెతో పాటు ఇంకో హీరోయిన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుందని వినికిడి. ఆమె ఎవరో తెలియాల్సి ఉంది.

మహేష్‌కి ఈ సినిమా సూపర్ హిట్ అవడం చాలా అవసరం. అతని లాస్ట్ మూవీ సర్కార్ వారి పాట హిట్ అయింది కానీ బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా యావరేజ్ హిట్‌తో సరిపెట్టుకుంది. పోకిరి, ఒక్కడు సినిమా వలె అతనికి గత నాలుగేళ్ల కాలంలో ఒక్క హిట్ రాలేదు. దాంతో అభిమానులు నిరాశ లోనే ఉన్నారు. ఈ సినిమా అయినా బ్లాక్‌ బస్టర్ హిట్ అయి మహేష్‌ను ఒక రేంజ్ లో నిలబెడుతుందేమో చూడాలి.

Share post:

Latest