రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్ రిపీట్..మహేష్ బాబుకు జోడిగా ఆలియా భట్..

ఎస్ఎస్ రాజమౌళి.. ఒక పేరు కాదు బ్రాండ్.. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు.. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో రాజమౌళి ఉన్నారు. అందుకోసం ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే రాజమౌళి మూవీ యూనిట్ లో కలిసి జపాన్ లో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.. దర్శకధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ కి సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.. మహేష్ బాబు సినిమాలోనూ ఆయనకు జోడిగా కనిపించే అవకాశం ఉందనే టాక్ వినిపోస్తోంది..

మహేష్ సినిమా ఎప్పుడంటే?

మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కేఎల్ నారాయణతో కలిసి ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతన్నారు రాజమౌళి.. ప్రస్తుతం టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో బిజీగా ఉన్న రాజమౌళి.. మీడియాలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మహేష్ బాబుతో ఆయన చేస్తున్న సినిమా గురించి స్పష్టత ఇచ్చారు. ఈ సినిమా గ్లోబల్ మొత్తం ట్రావెల్ అయ్యే ఒక అడ్వెంచర్ మూవీ అని కంఫర్మ్ చేశారు. ఈ చిత్రం ప్రధానంగా ఆఫ్రికా అడువుల నేపథ్యంలో సాగుతుంది.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లొకేషన్స్ లో కూడా ఈ మూవీని చిత్రీకరించనున్నారు.

మహేష్ బాబుతో చేసే సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ఆరంభంలో కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది..మహేష్ కెరీర్ లో ఇది 29వ చిత్రం.. మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై దుబాయ్ కు చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ ఓ ట్వీట్ చేశాడు. ‘ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. అందుకు కాంట్రాక్టు కూడా జరిగింది. ప్రస్తుతం ఆలియా భట్ గర్భవతిగా ఉంది. ఆమె డెలివరీ తర్వాత ఈ సినిమా షూటింగ్ కు హాజరవుతుంది’ అంటూ సంధూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఇక మహేష్ బాబు తన 28వ సినిమాను స్టార్ట్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.

Share post:

Latest