లైగ‌ర్ న‌ష్టాల‌తో కొత్త పంచాయితీలు… క‌ష్టాల్లో పూరి, ఛార్మీ…!

పూరి జ‌గ‌న్నాథ్ – విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్లో వ‌చ్చిన లైగ‌ర్ భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి డిజాస్ట‌ర్ అయ్యింది. పాన్ ఇండియా సినిమా అంటూ ఊద‌ర‌గొట్టుకున్నా ఫ‌లితం మాత్రం ప్లాప్‌గా వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను కొన్న బ‌య్య‌ర్లు అంద‌రూ భారీగా న‌ష్ట‌పోవ‌డంతో ఈ న‌ష్టాల పంచాయితీ కొద్ది రోజులుగా న‌డుస్తోంది. చాలా కేంద్రాల్లో ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు దారుణంగా న‌ష్ట‌పోయారు.

భ‌రీగా న‌ష్ట‌పోయిన బయ్యర్లు నష్టాన్ని పూడ్చుకునేందుకు ఛార్మిని ఆశ్రయిస్తున్నట్లు మీడియాలో కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాము కూడా చాలా న‌ష్ట‌పోయామ‌ని.. చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేద‌ని ఛార్మీ ఓపెన్‌గానే చెప్పేస్తోంద‌ట‌. చివ‌ర‌కు లాభం లేద‌నుకున్న బ‌య్య‌ర్లు, సెకండ్ బ‌య్య‌ర్లు అంద‌రూ క‌లిసి హైద‌రాబాద్‌లోని పూరి జ‌గ‌న్నాథ్ ఆఫీస్‌లో కూర్చొని సెటిల్ చేసుకోవాల‌ని డెసిష‌న్ తీసుకున్నార‌ట‌.

20 years worth lost with one movie : Charmy Emotional

అయితే మ‌రో టాక్ ప్ర‌కారం పూరి కనెక్ట్స్ కార్యాలయం లైగ‌ర్ బాధితుల‌కు ఎలాంటి పరిహారం చెల్లించడానికి సిద్దంగా లేదని వినిపిస్తుంది. చివ‌ర‌కు ఈ స‌మ‌స్య ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లిందని తాజా సమాచారం. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై వ‌చ్చే నెక్ట్స్ సినిమా రిలీజ్‌కు విడుదలకు వ్యతిరేకంగా వడ్డీతో పాటు పెండింగ్ మొత్తాన్ని చెల్లించేలా ప్రెజ‌ర్ చేస్తున్నార‌ట‌. ఏదేమైనా లైగ‌ర్ దెబ్బ‌తో పూరి, ఛార్మీకి క‌ష్టాలు మామూలుగా లేవ‌నే చెప్పాలి.