అతడు సినిమాలో విలన్.. నిజజీవితంలో స్టార్ హీరోలకు తండ్రి.. ఎవరో తెలుసా?

అవును, మీరు విన్నది నిజమే. అతను తన జీవితంలో చేసిన పాత్రలన్నీ కూడా విలన్ రోల్స్ మాత్రమే. అయితే తన కుమారులు ఇద్దరు మాత్రం చిత్ర పరిశ్రమలో హీరోలుగా చలామణీ అవుతున్నారు. ఇంతకీ అతను ఎవరని సందేహం కలుగుతోంది కదూ. యజ్ఞం సినిమాలో గోపీచంద్ కు విలన్ గా నటించి రాయలసీమ యాసలో మాట్లాడిన వ్యక్తి గుర్తున్నాడా? అతడే దేవరాజ్. బేసిగ్గా కన్నడ నటుడు నటుడు అయినటువంటి ఇతను తెలుగులో యజ్ఞం సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

యజ్ఞం సినిమాలో తన దగ్గర పనిచేసే ఒక పనివాడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయటానికి ఇష్టపడని ఒక తండ్రి రోల్ లో అతడు ఇరగదీసాడు. దేవరాజ్ 1953 సెప్టెంబర్ 20 లో బెంగళూరులోని లింగరాజుపురంలో రామచంద్రప్ప.. కృష్ణమ్మ అనే దంపతులకు జన్మించారు. దేవరాజ్ కు చిన్నతనం నుంచి నాటకాలపై ఆసక్తి ఉండటంతో సినిమాలలో నటించటానికి ఎక్కువ మక్కు చూపాడు. అలాగా ఒకరోజు తమిళ డబ్బింగ్ సినిమా ఆడిషన్స్ కి వెళ్లి అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తరువాత ఆయనకు వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. దేవరాజ్ మాతృభాష కన్నడ కావడంతో అప్పట్లో కోలీవుడ్లో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఒక్క కన్నడ కాకుండా తమిళం , తెలుగు భాషలలో కలిపి 200కు పైగా సినిమాలలో నటించాడు. అంతేకాకుండా దేవరాజ్ కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన అనుభవాలు కూడా వున్నాయి. దేవరాజ్ నటించిన వీరప్పన్ సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. దేవరాజ్ చంద్రలేఖను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఒక హీరోయిన్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు ప్రజ్వల్, ప్రణామ్. ఇక ఆయన కొడుకులు కన్నడలో హీరోలుగా స్థిరపడ్డారు. ప్రజ్వల్ ఒక స్టార్ హీరో ఇప్పటికే హీరోగా 25 సినిమాలు చేశాడు. అలాగే చిన్న కొడుకు ఇప్పుడిప్పుడే హీరోగా స్థిరపడుతున్నాడు.

Share post:

Latest