Unstoppable II: ఒకే వేదికపై బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ కనబడబోతున్నారా?

టైటిల్ చూడగానే మీకు పూనకాలు రావొచ్చు. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది మరి. ఈ ఈ అరుదైన కాంబో కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా సమాచారం ప్రకారం aha OTT టీం వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చలు జరుపుతున్నారని భోగట్టా. బాలకృష్ణ తో టాక్ షోలో గెస్ట్ లుగా పాల్గొనేందుకు వారిద్దరిని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే వారిద్దరిని ఇంటర్వ్యూ చేసేందుకు బాలకృష్ణను ఒప్పించిన యూనిట్ సభ్యులు, ఇప్పుడు ఆ ఇద్దరినీ ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఈ నెల చివరి వారంలో బాలకృష్ణ unstoppable కార్యక్రమం ప్రారంభం కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం ముమ్మురంగా జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరియు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న సీజన్ 2 అన్‌ స్టాపబుల్ కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నానే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ వంటి స్టార్స్ కలిసి రావడంతో షో యొక్క స్థాయి మరింతగా పెరగడం ఖాయం.

ఇదే షోలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొంటారని ఆయన తన గాడ్ ఫాదర్ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో కనిపిస్తాడని పుకార్ల షికారు చేస్తున్నాయి. మొత్తానికి ఈసారి బాలకృష్ణ అని స్టాపబుల్ సంచలనాత్మక కాంబినేషన్లతో రాబోతుంది అనిపిస్తుంది అంటూ నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఇక మెగాభిమానులకు కూడా ఇది పూనకాలు తెప్పించే విషయం అన్నమాట.