‘సీతారామం’ సీతపై నెటిజన్లు ఫైర్.. పరువు పోగొట్టుకుంటున్నావు అంటూ..

దల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సీతారామం.. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే.. ఈ సినిమా ఓటీటీలోనూ విడుదల అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ ల నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ ఆకట్టుకుంది. మృణాల్ ఠాకూర్ క్లయిమాక్స్ లో ఇరగదీసింది. ఆమె తప్ప మరో హీరోయిన్ సీతామహాలక్ష్మీ పాత్రకు న్యాయం చేయలేరనేలా మెప్పించింది.

ఫస్ట్ మూవీతోనే సక్సెస్ సాధించడంతో ఈ మరాఠి భామకు డిమాండ్ పెరిగింది. ఆమెకు ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. అందుకే తన రెమ్యూనరేషన్ ని కూడా పెంచిందని తెలుస్తోంది.. సీతారామం సినిమాకు రూ.కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ను రెట్టింపు చేసిందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం మృణాల్ ఠాకూర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు..

సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ ఎంతో అందంగా కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామరస్ ఫొటోలను, హాట్ ఫొటోలను షర్ చేస్తోంది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సీతారామంలో చీరకట్టులో ఎంతో అందంగా కనిపించి ఇప్పుడు ఈ చెత్త ఫొటో షూట్స్ చేయడం ఏంటని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అలా చేసి పవురు పోగొట్టుకుంటోందని కామెంట్లు చేస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ కొంతకాలం పాటు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటే మంచిదని నెటిజన్లు అంటున్నారు. మరీ ఈ కామెంట్లపై మృణాల్ ఠాకూర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే మృణాల్ ఠాకూర్ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. టాలీవుడ్ నుంచి భారీగా ఆఫర్లు వస్తున్నాయట.. వైజయంతి బ్యానర్లో సీతారామం చేసిన ఆమె.. ఇదే బ్యానర్లో మరో సినిమాకు ఓకే చేసినట్లు తెలుస్తోంది. పెద్ద ప్రొడక్షన్ అయిన వైజయంతి బ్యానర్ లో ఆమె రెండు మూవీస్ చేస్తుండటంతో ఆమెను వరుసగా ఫిల్మ్ మేకర్స్ సంప్రదిస్తున్నారట..

Share post:

Latest