గంగిరెద్దుపై జనసేన పోస్టర్ తో బేబమ్మ ఫొటో.. కృతి శెట్టి ఎలా రియాక్ట్ అయ్యిందంటే..

తెలుగులో లేటెస్ట్ రైజింగ్ హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో చేసిన ‘ఉప్పెన’ సినిమాతో స్టార్ గా మారిపోయింది. తన క్యూట్ లుక్స్.. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఉప్పెన హిట్ కావడంతో మరిన్ని పెద్ద ఆఫర్లు అందుకుంది. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ వంటి సినిమాల్లో అవకాశాలు అందుకుంది.. అయితే కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది.. ఇటీవల వరుసగా రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. రామ్ ‘ది వారియర్’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు అట్టర్ ఫాప్ అయ్యాయి.

ఇదిలా ఉండగా..ఈరోజు కృతి శెట్టి నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ అయ్యింది. ఈనేపథ్యంలో గురువారం రాత్రి ఈ బ్యూటీ ట్విట్టర్ లో అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇస్తూ వచ్చింది. త్వరలోనే మలయాలం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పింది. అలాగే టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ అని, రామ్ చరణ్ ఆరాధించే వ్యక్తి అని, మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనూ.. రియల్ లైఫ్‌లోనూ సూపర్ స్టార్ అని కృతి శెట్టి సమాధానం చెప్పింది. తమిళ హీరో విజయ్ ఇన్‌ స్పైరింగ్ స్టార్ అని.. అజిత్ సార్ చాలా నిజాయితీపరుడని అని అభిమానులకు జవాబు ఇచ్చింది.

ఇక ఒక అభిమాని మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు కృతి శెట్టి ఫొటోలు ట్విట్టర్ లో షేర్ చేశాడు. గంగిరెద్దుపై జనసేన పోస్టర్ తో పాటు కృతి శెట్టి ఫొటోలు, ఆటోలో పవన్ కళ్యాన్ తో పాటు కృతి శెట్టి ఫొటోలు ఉన్నాయి. ఈ ఫొటోలు కృతి శెట్టికి బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈక్రమంలో ఓ అభిమాని పవన్ కళ్యాణ్ గురించి అడిగాడు. ‘నేను కూడా మీలాగే అభిమానిని’ అని ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. డ్యాన్స్ చేస్తానని, పార్టీలకు దూరంగా ఉంటానని నెటిజన్ల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చేప్పింది.

Share post:

Latest