కోటా శ్రీనివాసరావు ఒక్క అవకాశం ఇవ్వమని NTR, మహేష్ ను అడిగితే ఇలా రియాక్ట్ అయ్యారట!

కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో కోటా శ్రీనివాసరావుది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి. అనేక చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన కోట తరువాతి రోజుల్లో ఓ తండ్రిగా, బాబాయ్ గా నటించి మెప్పించాడు. ఈ వయస్సులో కూడా అతను అడపాదడపా సినిమాలలో నటిస్తూ ఉండటం విశేషం. ఇకపోతే కోటా విలన్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్న సమయంలోనే తన కొడుకుని కోల్పోవడంతో పూర్తిస్థాయిలో ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇప్పటికీ కొడుకులేని బాధను అతను మానసికంగా అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆయనని అనేక యూట్యూబ్ చానెల్స్ ఇంటర్వ్యూ చేసాయి. ఈ క్రమంలో అతను అనేక విషయాలను బయట పెట్టారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను టాలీవుడ్ యంగ్ హీరోలైన మహేష్ బాబు, NTR, నాని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.. అంతేకాదు తనకు అవకాశం ఇస్తే ఇప్పటికీ సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఒక సందర్భంలో ఎదురైనప్పుడు సినిమాలో ఏదైనా అవకాశం ఉంటే చాన్స్ ఇవ్వమని అడిగారట. దానికి మహేష్ బాబు స్పందిస్తూ, మీరు మమ్మల్ని ఇలా చాన్స్ ఇవ్వమని అడగడం ఏంటండీ.. మీరే మాకు ఇవ్వాలిగాని! అని ఎంతో హుందాగా జవాబు ఇచ్చాడట. ఒక్క మహేష్ బాబు మాత్రమే కాదు ఎన్టీఆర్ అలాగే నాని ఎదురైనప్పుడు కూడా నేను అలాగే అడిగితే, వారి నుంచి కూడా వచ్చిన సమాధానం అదే కావడం అతన్ని ఒకింత ఆశ్చర్యపరిచింది అంటూ ఇంటర్వ్యూ సందర్భంగా కోట శ్రీనివాసరావు వెల్లడించారు.

Share post:

Latest