ఫ్యాషన్‌లో తమన్నాకు తిరుగే లేదు.. ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!

చూపు తిప్పుకోలేని అందం తమన్నా సొంతం. కొత్తగా ఎంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్నా ఈ మిల్కీబ్యూటీకి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండడం లేదు. సినిమాలలో హీరోయిన్‌గానే కాకుండా కొన్ని సందర్భాలలో స్పెషల్ సాంగ్‌లు కూడా చేస్తూ రెండు చేతులా ఆమె ఆర్జిస్తోంది. వరుస సినీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక వ్యాపార రంగంలోనూ ఆమె అడుగు పెట్టింది. బంగారు ఆభరణాల వ్యాపారం ప్రారంభించిన దూసుకు పోతోంది. ఇవే కాకుండా పలు అడ్వర్టయిజ్‌మెంట్లలో ఈ భామ తళుక్కుమంటోంది. తమన్నాకు వ్యక్తిగతంగా ఫ్యాషన్‌పై మక్కువ ఎక్కువే. ఆమె ఏం ధరించినా, ఏం వాడినా అంతా ఆశ్చర్యంగా తెలుసుకుంటూ ఉంటారు. తాజాగా ఆ మిల్కీ బ్యూటీ చేతిలో ఓ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ కనపడడంతో నెటిజన్లంతా దాని ధర తెలుసుకునేందుకు ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. తీరా ధర తెలిసిన తర్వాత షాక్ తిన్నారు. దీనికి సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్ పోషించిన తమన్నా ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా విమెన్ ఓరియెంటెడ్ సినిమా బబ్లీ బౌన్సర్ సినిమా చేసింది. ఇది త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల ఆమె పలు కార్యక్రమాలలో పాల్గొంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఆమె చేతిలో హ్యాండ్ బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.

దాని ధర గురించి ఆన్‌లైన్‌లో ఆరా తీయగా, రూ.90 వేలు అని తెలిసింది. గతంలోనూ తమన్నా భాటియా ఓ ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ధరించింది. దాని విలువ సుమారు రూ. 3 లక్షలు. సెలబ్రిటీలు ఇలాంటివి ఖరీదైన వస్తువులు వాడడానికి ఇష్టపడుతుంటారు. ఖరీదైన దుస్తులు, కార్లు, గ్యాడ్జెట్లు వంటివి వాడుతుంటారు. అందులోనూ తమన్నా ఏం వాడినా అది ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది.

Share post:

Latest