‘సీతారామం’లో సీత ఫ్రెండ్ పాత్ర చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?

సినిమాల్లో హీరోయిన్ అంటే అందంగా కనిపించాలి.. హీరోయిన్ విషయంలో దర్శక నిర్మాతలు ఎంతో కేర్ తీసుకుంటారు.. హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. దాదాపు సినిమాల్లో హీరోయిన్ తో పాటు ఆమె ఫ్రెండ్ పాత్ర కూడా డిజైన్ చేస్తుంటారు దర్శకులు.. కొన్నిసార్లు హీరోయిన్ కంటే ఆమె స్నేహితురాలి పాత్రలో నటించిన అమ్మాయిలు అందంగా కనిపిస్తూ ఉంటారు. అందుకే ఆడియన్స్ దృష్టి హీరోయిన్ తో పాటు వారి ఫ్రెండ్స్ అందం మీద కూడా వెళ్తుంది.. అయితే ఇటీవల కాలంలో దర్శకులు హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా వారి స్నేహితురాలి పాత్రలను డిజైన్ చేస్తున్నారు.. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే..

ఇటీవల దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన అమ్మాయి అందం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టపడేసింది. మృణాల్ ఠాకూర్ అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

అదేసమయంలో మృణాల్ ఠాకూర్ కు ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి కూడా తన అందంతో అందరినీ ఆకట్టుకుంది.. ఆమె పేరు రుక్మిణి విజయ్ కుమార్.. రుక్మిణి విజయ్ కుమార్ గురించి చెప్పాలంటే.. ఆమె ఓ డ్యాన్స్ కొరియో గ్రాఫర్ కూడా.. భరతనట్యం కూడా నేర్చుకుంది.. రుక్మిణిది హైదరాబాదే.. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించింది. ఆనంద తాండవం అనే సినిమాలో రొమాంటిక్ పాత్రలో కనిపించింది.. రజనీకాంత్ నటించిన ‘కచ్చాడియన్’ సినిమాలో ఆయన చెల్లెలి పాత్ర చేసింది. సీతారామంలో హీరోయిన్ స్నేహితురాలిగా తన అందంతో ప్రేక్షకుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకునేలా చేసింది..

Share post:

Latest