ఆమె పుట్టుకతోనే మూగాచెవిటి… అయితేనేమి, స్టార్ హీరోలతో కలిసి నటించింది!

అవును, మీరు విన్నది నిమమే. ఆమె పుట్టుకతోనే మూగాచెవిటి. అయితే ఆమె స్టార్ హీరోలతో కలిసి నటించింది, నేటికీ నటిస్తోంది. తాజాగా ‘సీత రామం’ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇక సినిమా రంగమంటేనే అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. పైగా ఒక హీరోయిన్ కి అయితే ఇంకా ఎక్కువ సవాళ్లు ఉంటాయి. ఇలాంటి రంగంలో ఆమె తనకున్న వైకల్యాన్ని పక్కనబెడుతూ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ ముందుకు పోతోంది. ఈమెకు ఉన్న లోపం చూస్తే అసలు ఈమె సినిమా రంగంలోకి ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోతారు. కానీ తనలో ఉన్న లోపాన్ని పక్కనపెట్టి ఎంతోమంది హీరోయిన్స్ కి ఆదర్శంగా నిలిచింది.

ఆమె మరెవ్వరో కాదు హీరోయిన్ అభినయ. అవును, ఈమె తెలుగులో స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్, నాగార్జున, రామ్ చరణ్, వెంకటేష్, రవితేజ, తాజాగా దుల్కర్ సల్మాన్ వంటి వాళ్ళతో నటించింది. అభినయ మాట్లాడడం, వినడం చేయదు. తమ కూతురు లోపాన్ని ఎలాగైనా సరిదిద్దాలని అభినయ కుటుంబం తమిళనాడు నుంచి హైదరాబాద్ కి వచ్చింది. ఇక మాట వినికిడి విషయం పక్కన పెడితే.. ఈమె చిన్నప్పటినుంచి తెలివి, చలాకీతనం ఉన్న అమ్మాయి. ఈమె తండ్రి కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశారు. అయితే కూతురుకి సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి ఎవరైనా అవకాశం ఇస్తే సినిమాల్లోకి తీసుకెళ్తామని తన ఫోటో ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరిగే వాడట.

ఈ క్రమంలో ఓ రోజు డైరెక్టర్ సముద్రఖని అభినయ ఫోటో చూసి చాలా బాగుందని అడిషన్స్ కి రమ్మని చెప్పాడు. అయితే ఆమె తండ్రి నా కూతురికి మూగ చెవిటి అని చెప్పేసాడట. అసలు సినిమా ఇండస్ట్రీలో కావాల్సిందే వినడం, మాట్లాడడం అలాంటిది ఇదే లేకపోతే ఎలా అని ఊరుకున్నాడు. ఇక అదే డైరెక్టర్ తమిళ్ లో ఆయన తీయబోయే ఒక సినిమాకి ఒక ముంబై హీరోయిన్ ని సెలెక్ట్ చేశాడు. కానీ ఆ హీరోయిన్ సదరు సినిమా చెయ్యను అని చెప్పేయడంతో డైరెక్టర్ కి పంతం పెరిగి మాట్లాడగలిగిన వాళ్లే నాకు ఈ భాష రాదు నేను మాట్లాడలేను అని అంటున్నప్పుడు ఏమాత్రం మాట్లాడలేని వాళ్లతో సినిమా తీస్తాను అని చెప్పి అభినయని హీరోయిన్గా పెట్టి సినిమా తీశాడు. ఇక అక్కడితో ఈమె జీవితం మారిపోయింది.

Share post:

Latest