ఆ పాపమే బేబమ్మ పాలిట శాపంగా మారిందా..కృతి చేసిన బిగ్ మిస్టేక్ ఇదే..!?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడం గొప్పకాదు వచ్చిన పేరుని 10 కాలాలపాటు అలాగే కంటిన్యూ చేయడం నిజమైన హీరోయిన్ లక్షణాలు. మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టడం ఎంత కష్టమో వచ్చిన ఆ హీరోయిన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అలా టాప్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయ్యి కొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీని ఏలేయడం అంతే కష్టం. అలా చాలా తక్కువ మంది ఉండగలరు. పాపం కృతి శెట్టి ఏదో అనుకుని ఇండస్ట్రీకి వచ్చి ఇంకేదో చేస్తూ అటూ ఇటూ ఎటూ కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది.

మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా ఎంటర్ అయిన ఉప్పెన సినిమాతో ఈ కన్నడ బ్యూటీ హీరోయిన్ గాఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతి శెట్టి. ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా హిట్ అవ్వడంతో ఇక్కడ అమ్మడు దశ తిరిగిపోయింది అనుకున్నారు అంత. అంతేనా వరుస ఆఫర్లతో స్టార్ హీరోలు కూడా కృతికి మైండ్ బ్లాకింగ్ రెమ్యూనరేషన్ ఇచ్చారు. అంతేకాదు స్టార్ ప్రొడ్యూసర్స్ అదృష్ట దేవత అంటూ కోట్లు పోసి మరి కాల్ షీట్లు ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే సీన్ కట్ చేస్తే కృతిశెట్టి నటించి రీసెంట్గా రిలీజ్ అయిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

మొదటిగా రామ్ హీరోగా నటించిన” ది వారియర్”.. నితిన్ హీరోగా నటించిన “మాచర్ల నియోజకవర్గం”.. సుధీర్ బాబు హీరోగా నటించిన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయితే దీనంతటికీ కారణం కృతి చేసిన ఆ పాపమే అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే బంగార్రాజు సినిమాలో కథ మొత్తం నాగమ్మ దేవత పైన కొనసాగుతూ ఉంటుంది.

ఆ టైంలో దర్శకుడు నాగమ్మకు ప్రత్యేక పూజలు చేయించారట . ఏవైనా తప్పు ఒప్పులు ఉంటే క్షమించమని సినిమా షూటింగ్ టైం లో తప్పులు దొర్లితే మన్నించమని ముందుగానే శాంతి పరిహార పూజలు చేయించారట . అయితే ఆ పూజకు కృత్తి శెట్టి హాజరవ్వలేదట . వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉండి కృతి శెట్టి ఆ పూజ ను నెగ్లెట్ చేసిందట. సినిమా యూనిట్ మొత్తం ఆ పూజకు అటెండ్ అయ్యారు . కానీ కృత్తి శెట్టి మాత్రం హాజరు కాలేకపోయిందట. ఈ కారణంగానే ఆమెకు ఫ్లాప్ సినిమాలు పడుతున్నాయని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో ఆ దేవుడికే తెలియాలి

Share post:

Latest