కృష్ణంరాజు చివరి కోరిక.. ప్రభాస్ పెళ్లి కాదంట..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 3:25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఇక ఈయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ ఒకసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణంరాజు మృతితో పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.Actor Krishnam Raju | Nephew Prabhas Varma | Telugu Movie Okka Adugu |  Baahubali - Filmibeat

ఇకపోతే రెబల్ స్టార్ కృష్ణంరాజు చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచారు. ఇక కృష్ణంరాజు చివరి కోరిక ప్రభాస్ పెళ్లి.. నిజానికి గత పది సంవత్సరాల నుంచి ప్రభాస్ కి పెళ్లి చేయాలనే కోరికతో కృష్ణంరాజు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభాస్ అందుకు అంగీకరించలేదు . కానీ ప్రభాస్ పై మాత్రం ఎన్నో రూమర్లు పుట్టుకొచ్చాయి. వర్షం సినిమా షూటింగ్ సమయంలోనే త్రిషతో ప్రేమలో పడడం ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కృష్ణంరాజు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత అనుష్కను వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయంపై అనుష్క ఖండించింది. ఇప్పటికీ ఎప్పటికీ తాము స్నేహితులుగానే ఉంటామని అనుష్క వెల్లడించడంతో ఇక వీరిద్దరు కూడా వివాహం చేసుకోరు అని వార్తలకు స్పష్టత వచ్చింది.

Youth called me as Prabhas's Father',says Krishnam Raju : TV5 News - YouTube

ఇక ఇటీవల ఆది పురుష్ సినిమా షూటింగ్ సెట్లో కృతి సనన్ తో క్లోజ్ గా ఉండడం చూసి కృతి సనన్ ను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇవేవీ నిజం కాకపోవడం గమనార్హం. ఇక అప్పుడు ఇప్పుడు అంటూ పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చిన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా తన పెదనాన్న కూడా చివరి శ్వాస వదలడం జరిగింది. మరి ఇకనైనా వివాహం చేసుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది. కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి కంటే సంతోషాన్ని ఇచ్చే మరో అంశం ఇంకోటి వుందని కృష్ణంరాజు అంటూ ఉండేవారు దీన్ని బట్టి చూస్తే కృష్ణంరాజు చివరి కోరిక మాత్రం ప్రభాస్ పెళ్లి కాదని స్పష్టమవుతుంది . మరి కృష్ణంరాజు చివరి కోరిక ఏమిటి అంటే ప్రభాస్ పిల్లలతో కూడా సినిమాలలో నటించాలని తన చివరి కోరిక అని చెబుతూ ఉండేవారు కృష్ణంరాజు. కానీ చివరి కోరిక తీరకుండానే తుది శ్వాస విడిచారు.

Share post:

Latest