కృష్ణంరాజు మర్యాదలు మరీ… ఇంత దారుణంగా ఉంటాయా..!

తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో శోకసంద్రంలో మునిగిపోయిన రోజు ఈరోజు ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తెల్లవారుజామున హత్ మరణం చెందారు. ఆయన మరణంతో రెండు రాష్ట్రాలలో ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాలలోని గోదావరి జిల్లాలు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు.

ఆయన రాజ కుటుంబంలో పుట్టడంతోమ‌ర్యాద‌లు అంటే ఆయనకు చాలా ఇష్టమట. ఆయన మర్యాదలు చూసినవారు చాలా దారుణంగా ఉంటాయని అంటారు కూడా.కృష్ణంరాజు తన ఇంటికి వచ్చిన వారిని మర్యాదల‌తో ముంచేత్తుతారు. అదే క్రమంలో వారికి భోజనాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు కూడా. కృష్ణంరాజు తన ఇంట్లో చేసే మర్యాదలు గురించి చాలా సందర్భాల్లో చెప్పారు. కృష్ణంరాజు ఆ మర్యాదల చేయడానికి ఒక అనుకోని కథ కూడా ఉందట…. కృష్ణంరాజు చిన్నప్పుడు వారి ఇంటికి ఒక పెద్దాయన వస్తే కృష్ణంరాజు ఆయన ముందు కాలు మీదా కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నారట.

Actor Krishnam Raju scotches ill-health rumours

ఆయన తిరిగి వెళ్లేంతవరకు కృష్ణంరాజు అలానే కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉన్నారట. ఆయన వెళ్లాక కృష్ణంరాజు తండ్రిగారు ఆయన నీ మీద కోపంతో కొరడా పట్టుకుని చితక కొట్టారట. ఆయన తండ్రి కృష్ణమరాజుకి ఇంటికి ఎవరు వచ్చినా ముందు గౌరవించాలని ఆయన తండ్రి గారు చెప్పారట అప్పటినుంచి కృష్ణంరాజు తన ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేస్తూనే వస్తున్నారు.

Share post:

Latest