కృష్ణా తమ్ముళ్ళకు కొడాలి ట్రైనింగ్..!

మొత్తానికి కొడాలి నాని వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తెలుగుదేశం లీడర్లు అంతా ఏకమయ్యారు. అలాగే కొడాలి బూతులని సైతం తెలుగు తమ్ముళ్ళు బాగా నేర్చుకున్నారు. కొడాలి మాటలు కొడాలికే అప్పజెప్పుతున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి నాని..ఏ విధంగా చంద్రబాబు, లోకేష్‌ల గురించి తీవ్ర స్థాయిలో బూతులు తిడుతున్నారో అందరికీ తెలిసిందే. ఇక కొడాలి నానిని మించి ఎవరూ కూడా బాబుని అలా తిట్టారు. అంటే  ఆ స్థాయిలో బాబుని కొడాలి తిడుతున్నారు.

ఆ తిట్లు మామూలుగా కాదు…ఒక వీధి బాషలో బూతులు మాట్లాడటమే. మరి ఇలా మాట్లాడటం వల్ల టీడీపీకి నష్టం జరిగి, వైసీపీకి లాభం జరుగుతుందా? అంటే అదేం కనిపించడం లేదు. అయినా సరే కొడాలి తగ్గడం లేదు. మంత్రిగా ఉన్నప్పుడు అదే దూకుడు. మంత్రి పదవి పోయాక కూడా అదే దూకుడు. ఇటీవల కొడాలి మరీ దారుణమైన తిట్లు తిట్టారు.

అలాగే లోకేష్ ఎవడికి పుట్టాడో తెలియదని మాట్లాడి..భువనేశ్వరిని ఉద్దేశించి పరోక్షంగా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని సైతం అదేవిధంగా తిట్టారు. ఇలా దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేతలు కూడా అదే బాషతో కొడాలికి కౌంటర్లు ఇచ్చారు. ముఖ్యంగా కృష్ణ జిల్లా టీడీపీ నేతలు..దారుణంగా కొడాలిని తిట్టారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే…ఇప్పటివరకు కొడాలి..బాబుని తిడితే ఇద్దరో, ముగ్గురో నేతలు మాత్రమే కౌంటర్ ఇచ్చేవారు.

ఇప్పుడు అలా కాదు..జిల్లాలోని నేతలంతా మూకుమ్మడిగా కొడాలిపై మాటల దాడి చేశారు. అసలు ఎప్పుడు పరుషపదజాలం మాట్లాడని కొల్లు రవీంద్ర, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, జయమంగళ వెంకటరమణ..ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లా నేతలంతా కొడాలిని తీవ్రంగా తిట్టారు. ఇక ఇప్పటివరకు దూకుడుగా లేని గుడివాడ టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు సైతం తీవ్ర స్థాయిలో నానిపై విరుచుకుపడ్డారు. అలాగే గుడివాడలో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. మొత్తానికి కృష్ణా జిల్లా టీడీపీ నేతలని తన బూతులతో నాని యాక్టివ్ చేశారు.

Share post:

Latest