ఆ హీరోతో ఎప్పటికైనా ఆ కోరిక తీర్చుకుంటానంటున్న కాజల్..!

ముంబై అందం కాజల్ అగర్వాల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వివాహం తర్వాత అడపాదడపా సినిమాలలో చేసినా.. కొడుకు జన్మించిన తర్వాత పూర్తిగా తన స్పీడును తగ్గించిందని చెప్పవచ్చు. ఇక ఒకప్పుడు ఫుల్ యాక్టివ్ గా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎక్కువగా పర్సనల్ లైఫ్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా సమయంలో వివాహం చేసుకున్న కాజల్ వెంటనే తలైంది. ఇక ఆమె అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల నుంచి తప్పుకోవడం గమనార్హం. ఇక అలా ది ఘోస్ట్, ఆచార్య సినిమాలనుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇకపోతే ఆచార్య సినిమా డిజాస్టర్ అవడంతో కాజల్ కి ఒక రకంగా మంచే జరిగిందని చెప్పవచ్చు.

Kajal Aggarwal Age, Family, Husband, Movies, Biography, Wiki - Breezemasti

ఇకపోతే కాజల్ భర్త కిచ్లు వ్యాపారాలను ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే ఇతడు ముంబైలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఇకపోతే ఇద్దరూ కలిసి వెంచర్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాజల్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా సంపాదించే పనిలో పడింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఆమె పలు యాడ్స్, బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బాగా సంపాదిస్తుంది. ఇక తాజాగా ఒక యాడ్ కోసం కాజల్ నటించిన వీడియో షేర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే రాపిడ్ ఫైర్ సెషన్ ను ఎదుర్కొంది కాజల్ . అందులో భాగంగా కట్ ఛాయ్ ఇష్టమా? ఫిల్టర్ కాఫీ ఇష్టమా ? అని అడిగగా.. కట్ ఛాయ్ ఇష్టం అని చెప్పేసింది. ఇక సల్మాన్ ఖాన్ తో అడ్వెంచర్లు చేస్తావా ? షారుఖ్ ఖాన్ తో రొమాంటిక్ డేట్ కి వెళ్తావా? అని అడిగితే తెలివిగా సల్మాన్ ఖాన్ తో అడ్వెంచర్లు చేస్తాను అని తెలిపింది.

Star Hero Whom Kajal Finds Kindest & Charming! | Tupaki English

ఇక అలా ఎప్పటికైనా సరే సల్మాన్ ఖాన్ తో అడ్వెంచర్ చేసి తన కోరికను తీర్చుకుంటాను అని పరోక్షంగా తెలియజేసింది కాజల్ అగర్వాల్.

Share post:

Latest