హీరోయిన్ రంభ తో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన జెడి చక్రవర్తి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో జే.డీ. చక్రవర్తి ఒకప్పుడు హీరోగా ఎన్నో మంచి సినిమాలలో నటించారు. అయితే ఈ నటుడు నటుడుగానే కాకుండా స్క్రిప్ రైటర్ ,డైరెక్టర్, ,నిర్మాత గాయకుడుగా కూడా ఎన్నో సినిమాలకు పనిచేశారట. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో కూడా ఎన్నో సినిమాలలో నటించి ప్రసిద్ధి నటుడుగా పేరుపొందాడు. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ బ్లాక్ బాస్టర్ చిత్రం శివ సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు చక్రవర్తి.

Kodanda Ramudu Songs - Kodanda Ramayyaku - J D Chakravarthi, Rambha, Laya -  HD - video Dailymotion

ఆ తర్వాత శివ సినిమాతో బాలీవుడ్లోకి ప్రవేశించారు ఇలా వరుస అవకాశాలు ముందుకు దూసుకు వెళ్తూ.. నిర్మాతగా రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేశారు. అయితే హీరోగా నటిస్తూ మంచి బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారని చెప్పవచ్చు. అనేక అవార్డులను కూడా పొందిన జెడి చక్రవర్తి గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. తనకు అవకాశాలు రాకపోవడం పై తన సినిమాలు ఫ్లాప్ కావడం పై స్పందించడం జరిగింది.

జెడి చక్రవర్తి సినిమా చేయడం వరకే తన చేతిలో ఉందని తెలియజేశారు.ఆ తర్వాత సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందా..లేదంటే ప్లాప్ అవుతుందా అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉందని తెలిపారు. ఎవరైనా సినిమా చేసేటప్పుడు విజయం సాధించాలని చేస్తారు. సినిమా విజయం సాధిస్తే అవకాశాలు ఇండస్ట్రీలో పెరుగుతాయి సినిమా ఫ్లాప్ అయితే అవకాశాలు తగ్గేది ఏ ఇండస్ట్రీలో నైనా.. సర్వసాధారణమని తెలిపారు. అయితే తెలుగు ఇండస్ట్రీలో తనకి బాగా క్లోజ్ గా ఉండేది మాత్రం హీరోయిన్ రంభ అని తెలియజేశారు. అయితే రంభ పెళ్లికి హాజరు కాకపోవడం వల్లే తామద్దరి మధ్య కాస్త మాటలు లేవని తెలియజేశారు. అంతేకానీ తామిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు.

Share post:

Latest