పుట్టెడు దుఃఖంలో కూడా ఎన్టీఆర్ తో అర్ధరాత్రి అలాంటి పని చేసిన జయలలిత..!!

ఎన్టీఆర్ – జయలలిత కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలలో గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ అధినేత గోపాలకృష్ణ నిర్మించిన చిత్రం కథానాయకుడు.. కె. హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నీతి, నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన యువకుడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇక ఆయనను ప్రేమించే యువతిగా జయలలిత నటించిన ఇకపోతే ఈ సినిమాలో రెండు పాటలను కలర్లో తీశారు. ఇక అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మాత్రమే వచ్చేవి. కానీ ఈ సినిమాలో ” వయసు మళ్లిన బుల్లోడా” అనే పాట కోసం ప్రసాదు స్టూడియోలో 40 వేల రూపాయల ఖర్చు చేసి సెట్ చేశారు. అంతేకాదు ఆ కాలంలో వారు వేసిన సెట్ ఒక సెన్సేషనల్ గా మారింది . దానిని చూడడానికి చాలామంది దర్శక నిర్మాతలు అందరూ కూడా వచ్చారు. 1969 ఫిబ్రవరి 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. మూడు రోజుల పాటు ప్యాచ్ వర్క్ పూర్తి చేయడం కోసం ఎన్టీఆర్ , జయలలిత కూడా డేట్లు ఇచ్చారు.

From NTR to Jayalalitha Top South Indian Actors in Indian Politics - News  Nation English

అంతా బాగానే జరుగుతున్న సమయంలో తమిళనాడు సీఎం అన్నాదురై మరణించడంతో తమిళనాడు ఒక్కసారిగా స్తంభించిపోయింది.. షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇక ఆ సమయంలో ప్యాచ్ వర్క్ అసాధ్యంగా మారింది. కానీ ఎలాగైనా సరే జరపాలి. రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు.. ఒకవేళ ఫిబ్రవరి 6 లోపు షూటింగ్ పూర్తి చేయకపోతే మళ్లీ ఆరు నెలల వరకు ఎన్టీఆర్ డేట్స్ దొరకవు.. ఇక అప్పటికే జయలలిత కూడా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.. కానీ అన్నాదురై అంత్యక్రియలు పూర్తయితే తప్ప షూటింగ్ మొదలు పెట్టలేని పరిస్థితి.. దీంతో నిర్మాత గోపాలకృష్ణ టెన్షన్ పడుతూనే అన్నాదురై అంత్యక్రియలు పూర్తి అవ్వగానే మొదలుపెట్టారు.

elurumovies369® on Twitter: "#OldMemories NTR With Jayalalitha NBK With  Jayalalitha #RIPJayalalitha #Ripamma #JoharJayalalitha  https://t.co/Jq08OugRWj" / Twitter

అంత్యక్రియలకు టీ నగర్ నుండి బీచ్ వరకు కాలినడకన వెళ్లిన జయలలిత ఎప్పుడు షూటింగ్ స్పాట్ కి వస్తుంది అని.. మరొకవైపు ఎన్టీఆర్ మేకప్ తో సిద్ధంగా ఉండడం గంట గంటకు ఫోన్ చేస్తుండడంతో దర్శకు నిర్మాతలకు సైతం చెమటలు పెట్టాయి . చివరికి మధ్యాహ్నం మూడు గంటలకు జయలలిత స్టూడియోలో అడుగుపెట్టింది.ఇక రాత్రి 12:00 కల్లా షూటింగ్ పూర్తి చేస్తే కారు గిఫ్ట్ గా ఇస్తానని గోపాలకృష్ణ చాయాగ్రాహకుడు వైయస్ స్వామికి తెలిపాడట . ఇక దీనికి ఎన్టీఆర్, జయలలిత కూడా సహకారం అందించడం.. అలా అర్ధరాత్రి 12 గంటల సమయంలో షూటింగ్ పూర్తి చేశారు . పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ తో అర్ధరాత్రి షూటింగ్ పూర్తి చేశారు జయలలిత. ఇక ప్రకటించిన రిలీజ్ డేట్ రోజే సినిమాను విడుదల చేయడంతో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.

Share post:

Latest