జగ్గయ్యపేట సీటు ఫిక్స్..టీడీపీకే ప్లస్?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఆ కంచుకోటలని జగన్ కూల్చేశారు. పలు సీట్లలో వైసీపీ గెలిచింది. కానీ ఇప్పుడు సీన్ మారుతూ వస్తుంది..అనూహ్యంగా కంచుకోటల్లో  టీడీపీ పుంజుకుంటూ వస్తుంది..అటు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ఈ పరిణామాలు టీడీపీకి బాగా కలిసొస్తున్నాయి. ఇక అలా టీడీపీకి ప్లస్ అవుతున్న స్థానాల్లో జగ్గయ్యపేట కూడా ఒకటి.

ఇక్కడ టీడీపీ చాలాసార్లు సత్తా చాటింది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి శ్రీరామ్ తాతయ్య గెలిచారు…కానీ 2019 ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో సామినేని ఉదయభాను చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి యాక్టివ్ గా పనిచేస్తూ వస్తున్నారు. టీడీపీ బలం ఏ మాత్రం తగ్గిపోకుండా చూసుకుంటూ వస్తున్నారు. అటు వైసీపీపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుంది. ఇక ఆమధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగ్గయ్యపేటలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది…దాదాపు వైసీపీని ఓడించినంత పనిచేసింది. కానీ అధికార బలంతో వైసీపీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది

అయినా సరే ఇక్కడ టీడీపీకి బలం పెరిగిందని తెలిసేలా మున్సిపల్ ఎన్నిక జరిగింది. అక్కడ నుంచి ఇంచార్జ్ గా ఉన్న తాతయ్య మరింత దూకుడుగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. మరొకసారి ఉదయభానుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా సత్తా చాటాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ఇంకా ఎన్నికలకు సమయం ఉండగానే…జగ్గయ్యపేట సీటు తాతయ్యదే అని చంద్రబాబు తేల్చి చెప్పేశారు.

తాజాగా తాతయ్య..చంద్రబాబుతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పరిస్తితుల గురించి వివరించారు. అయితే జగ్గయ్యపేటలో పార్టీ పరిస్తితిపై బాబు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. అలాగే ఈ సీటు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఇక విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం సహకారం తీసుకుంటూ…జగ్గయ్యపేటలో మంచి మెజారిటీతో గెలవాలని బాబు…తాతయ్యకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి సీటు వచ్చిన ఊపుతో తాతయ్య మరింత దూకుడుగా పనిచేసే ఛాన్స్ ఉంది.