రిస్క్‌లో మంత్రులు..జగన్ చెప్పింది కరెక్టే..!

ఎలాగైనా నెక్స్ట్ కూడా అధికారం దక్కించుకోవాలని చెప్పి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు. రెండోసారి కూడా మంచి మెజారిటీతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే మళ్ళీ గాని అధికారంలోకి రాకపోతే ఏం అవుతుందో జగన్‌కు బాగా క్లారిటీ ఉంది. ఎందుకంటే వైసీపీ చేతిలో చుక్కలు చూసి మంచి కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే పరిస్తితులు తారుమారైపోతాయి.

అందుకే జగన్…మళ్ళీ కూడా అధికారం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు. అలాగే గెలుపు కోసం సరిగ్గా పనిచేయని నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు వర్క్ షాప్ పెట్టి..పనిచేయని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నారు. సరిగ్గా పనిచేయకపోతే ఎమ్మెల్యే సీటు ఇవ్వనని తేల్చి చెప్పేస్తున్నారు. తాజాగా కూడా జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలకు, మంత్రులకు జగన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.

ముఖ్యంగా గడప గడపకు కార్యక్రమం సక్సెస్‌గా నిర్వహించని వారికి..ఇకనుంచైనా పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచించారట. దాదాపు 27 మంది ఎమ్మెల్యేలకు జగన్ గట్టిగానే చెప్పారని తెలిసింది. అందులో కొందరు మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విశ్వరూప్, రోజా, దాడిశెట్టి రాజా, తానేటి వనిత..వీరు గడపకు గడపకు నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారని, ఇకనైనా ముందుకెళ్లాలని సూచించారు. అటు మాజీ మంత్రుల్లో పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ళ నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యేలు వచ్చేసరికి గ్రంథి శ్రీనివాస్, అదీప్ రాజ్, ధనలక్ష్మీ, కొండేటి చిట్టిబాబు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, చక్రపాణి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..ఇంకా పలువురు ఎమ్మెల్యేలు గడప గడపకు ప్రోగ్రాంని తక్కువ రోజులు నిర్వహించారని తెలిసింది. ఇలాగే ఉంటే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని జగన్ తేల్చి చెప్పినట్లు తెలిసింది. జగన్ చెప్పిన రిపోర్ట్ ప్రకారం..మంత్రులకు మాత్రం బాగా నెగిటివ్ ఉందని తెలిసింది. వారు గాని జనంలోకి వెళ్లకపోతే నెక్స్ట్ గెలుపు దూరమయ్యే ఛాన్స్ ఉంది.