ఇలియానా డేటింగ్ లో ఉన్నది నిజమే.. క్లారిటీ ఇచ్చిన కత్రినా కైఫ్..!

ప్రముఖ హీరోయిన్ ఇలియానా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా బరువు పెరిగిపోయింది . ఆ తర్వాత సినిమాలలో అవకాశాల కోసం తన బరువును తగ్గించుకొని మళ్లీ ప్రయత్నం చేసినా సరే పూర్వ వైభవాన్ని పొందలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆండ్రూ నీబోన్ అనే విదేశీయుడుతో డేటింగ్ చేసింది. ఇక ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఏమైందో తెలియదు కానీ ఈ జంట విడిపోయింది.Koffee With Karan 7: Ileana D'Cruz is dating Katrina Kaif's brother  Sebastian reveals Karan Johar : Bollywood News - Bollywood Hungama

పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయిన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇలియానా. కానీ ఆ తర్వాత కూడా పెద్దగా ఈమెకు అవకాశాలు కలిసి రాలేదు. ఇక ఇప్పుడు కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో డేటింగ్ చేస్తోందని పుకార్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆమధ్య కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకలను మాల్దీవుల్లో నిర్వహించగా ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఇలియానా కూడా కనిపించింది. ఇక ఆ ఫోటోలను కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అప్పటినుంచి ఇలియానా , కత్రినా కైఫ్ సోదరుడు డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపించాయి.Ileana D'Cruz reveals she was body shamed by 'random people' at 12: It's a  deeply ingrained scar | PINKVILLA

ఇదంతా ఇలా ఉండగా తాజాగా కత్రినాకైఫ్, సిద్ధాంత్ చతుర్వేదితో పాటు ఇషాన్ కట్టర్ తో కలిసి కాఫీ విత్ కరణ్ షో కీ హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలోనే ఇలియానా , సెబాస్టియన్ డేటింగ్ కి క్లారిటీ రావడం జరిగింది. ఇక కరణ్ జోహార్ మాట్లాడుతూ.. కత్రినా.. నీ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి మాల్దీవుల ట్రిప్ ఫోటోలు బయటకు వచ్చినప్పుడు.. మైండ్లో కొన్ని ప్రశ్నలు తిరిగాయని ఆయన అడిగారు..ఇక అందులో భాగంగానే ఇలియానా , సెబాస్టియన్ తొలిసారి ఓ పార్టీలో కలిశారని .. అప్పుడే ఇంత ఫాస్ట్ గా స్టోరీ నడిచిందా ? అని అనుకున్నాను అని కూడా కరణ్ తెలిపాడు.

ఈ ప్రశ్నకు కత్రినా కైఫ్ నవ్వుతూ.. కరణ్ పార్టీలో అందరినీ గమనిస్తుంటారు అంటూ చురక అంటించే ప్రయత్నం చేసింది. ఇక అలా ఇలియానా – సెబాస్టియన్ డేటింగ్ లో ఉన్న విషయాన్ని ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.

Share post:

Latest