చైతన్య సినిమాలో ఆ స్టార్ హీరో విలనా…?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలలో అక్కినేని నాగచైతన్య కూడా ఒకరిని చెప్పవచ్చు.. ఈ ఏడాది వరుసగా పలు సినిమాలు విడుదల చేయగా.. అవి డిజాస్టర్ గా మిగిలాయి. చివరిగా బంగర్రాజు సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక తర్వాత నాగచైతన్య నటించిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమా రెండు భారీ డిజాస్టర్ ను చవిచూశాయి. నాగచైతన్య గత సినిమాలు ప్లాప్ అయిన తర్వాత తన తదుపరి చిత్రాలపైన భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.. ఇక తర్వాత వెంకట్ ప్రభు, పరశురాం డైరెక్షన్లో తన తదుపరిచిత్రాలు చేయబోతున్నారు.

Naga Chaitanya to team up with Arvind Swamy? | The News Minute
ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్లో నాగచైతన్య సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ చిత్రంలో అరవిందస్వామి కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య, అనిల్ రావు పూడి కాంబినేషన్లో కీలకమైన పాత్ర కోసం అరవింద స్వామిని అడగగా అరవింద స్వామి భారీ మొత్తంలో డిమాండ్ చేయడంతో.. నిర్మాతలు అందుకు అంగీకరించకపోవడంతో ఆ సినిమా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. వెంకట్ ప్రభు, చైతన్య సినిమాలు నటించడానికి అరవింద స్వామిని ఒప్పించినట్లు సమాచారం.

Aravind Swamy : రెండోసారి.. - Filmify Telugu
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ధ్రువ సినిమాలో రామ్ చరణ్ కు విలన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అరవింద స్వామి బాలకృష్ణ సినిమాకి నో చెప్పాడు చైతన్య సినిమాకి ఓకే చెప్పడం తో బాలయ్య అభిమానులను కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లుగా సమాచారం. నాగచైతన్య తర్వాత సినిమాలతో ఖచ్చితంగా విజయం సాధిస్తారని నాగచైతన్య అభిమానులు కూడా చాలా నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. మరి నాగచైతన్య తన కొత్త ప్రాజెక్టుల విషయాన్ని అధికారికంగ ప్రకటిస్తారేమో చూడాలి మరి. సమంత విడాకుల తర్వాత చైతన్య సినిమాలతో బిజీగా మారిపోయారు.